వైసీపీలోకి ‘యనమాల ‘ ? ఆఫర్ అదిరిందిగా ?

ఎన్నికల సమయం దగ్గర పడింది అంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి.

ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి నేతలు వలసలు సర్వసాధారణంగా మారిపోతూ ఉంటాయి.

ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కే అవకాశం లేదనుకున్న నేతలు ఇతర పార్టీలో చేరి టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేయడమో.

లేదా పార్టీ మారక ముందే తాము చేరబోయే పార్టీలో తమకు లభించే ప్రాధాన్యం , టిక్కెట్, పదవి విషయంలో స్పష్టమైన హామీ పొంది పార్టీ మారుతూ ఉంటారు.

ఇప్పటికే ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి జోరుగా వలసలు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగు బావుట ఎగురవేశారు.

వారంతా టిడిపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇది ఎలా ఉంటే టిడిపి నుంచి కీలక నాయకులు కొంతమంది వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2023/02/ap-government-2024-elections-chandrababu-naidu-yanamala-ya-tuni-tdp-inchaege!--jpg"/ టిడిపిలో చంద్రబాబు సాయి వ్యక్తిగా ముద్రపడిన ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుటుంబం నుంచే ఈ వలస ఉండబోవడం చర్చనీయాంశంగా మారింది.

యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు వైసీపీలో చేరేందుకు సర్వం సిద్ధమైనట్లు సమాచారం.గత కొంతకాలంగా యనమాల రామకృష్ణుడు కుటుంబంలో తుని నియోజకవర్గ సీటు కోసం పోటీ, వివాదం మొదలైంది.

తుని నుంచి యనమల రామకృష్ణుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.ఆ తర్వాత వరుస ఓటములు ఎదురుకావడంతో.

ఆయన స్థానంలో రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు పోటీ చేసినా రెండుసార్లూ ఓటమి చెందారు.

అయితే 2024 ఎన్నికల్లో రామకృష్ణుడు తన కుమార్తె దివ్య ను పోటీ చేయించేందుకు నిర్ణయించుకున్నారు.

""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2023/02/2024-elections-chandrababu-naidu-yanamala-ya-tuni-tdp-inchaege-minister-dadisetti-raja-tuni-mla!--jpg"/ ఈ మేరకు తుని టిడిపి ఇన్చార్జిగా దివ్య పేరును చంద్రబాబుతోనే చెప్పించి పై చేయి సాధించారు.

ఈ వ్యవహారాలపై కృష్ణుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట.దీంతో ఈ అంశంపై నియోజకవర్గ పార్టీ నేతలతో ఆయన జరిపిన ఫోన్ సంభాషణ బయటికి రావడంతో అదికాస్తా వైరల్ అయింది.

పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం తనకు తీవ్రమనిస్థాపాన్ని కలిగించిందని ఆయన అనుచరులతో తను బాధను వెళ్ళబోసుకున్నారట.

ఈ వ్యవహారంపై వైసీపీ అలర్ట్ అయింది.టిడిపి అధిష్టానం పైన, తన సోదరుడు రామకృష్ణుడు పైన అసంతృప్తితో ఉన్న కృష్ణుడిని వైసీపీలో చేరాల్సిందిగా ఒత్తిళ్లు వస్తున్నాయట.

ప్రస్తుతం తుని నుంచి ప్రస్తుతం మంత్రి దాడిశెట్టి రాజా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2024 ఎన్నికల్లోను దాడిశెట్టి రజాక్ వైసీపీ సీటు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.దీంతో కృష్ణుడిని వైసీపీలో చేర్చుకుని ప్రస్తుతం ఆయనకు టీటీడీ బోర్డు సభ్యుడుగా అవకాశం కల్పించి, ఎన్నికల సమయంలో కుదిరితే ఎమ్మెల్యే సీటు ,లేకపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తుంది.

దీనిపై కృష్ణుడు కూడా తన అనుచరులతో సమావేశమై, వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారట.వైసీపీ ఇచ్చిన ఆఫర్ కూడా కృష్ణుడికి నచ్చడంతో త్వరలోనే ఆయన వైసిపి కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రేడియోయాక్టివ్ మెటీరియల్ వద్దకు వెళ్తే 5 నిమిషాల్లో మరణం తథ్యం..?