ఆ యమహా బైక్‌కి సరికొత్త కలర్ ఆప్షన్ లాంచ్.. బైక్ ఫీచర్లు ఇవే..!
TeluguStop.com

యమహా ( Yamaha ) ఇటీవల భారతదేశంలో తన FZ-S V3 బైక్‌కి కొత్త కలర్ ఆప్షన్‌ను పరిచయం చేసింది.


అదే మ్యాట్ బ్లాక్ కలర్.( Matte Black ) ఈ బైక్ ధర రూ.


1.21 లక్షలు (ఎక్స్-షోరూమ్).
మ్యాట్ బ్లాక్ షేడ్ FZ-S V3 స్టాండర్డ్ వేరియంట్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.
అయితే, మెకానికల్‌గా మ్యాట్ బ్లాక్ వేరియంట్ FZ-S V3 బైక్ ఇతర వేరియంట్లకు సమానమైన ఫీచర్లతో వస్తుంది.
కొత్తగా రంగు ఎంపిక మాత్రమే మారుతుంది.FZ-S V3 149cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 12.
2bhp గరిష్ఠ శక్తిని, 13.3Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇంజన్ తాజా RDE, BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ అయింది.
FZ-S V3లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపున మోనో సస్పెన్షన్ ఉన్నాయి.
"""/" /
బ్రేకింగ్ విషయానికొస్తే ఇందులో ముందు 282mm డిస్క్, వెనుక 220mm డిస్క్ ఆఫర్ చేశారు.
దీనిలో సింగిల్-ఛానల్ ABS కూడా ఉంది.ఇక రెండు వైపులా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉండగా ముందువైపు 100/80 టైర్లు, వెనుక 140/60 టైర్లు ఉన్నాయి.
FZ-S V3 బరువు 135కేజీలు ఉంటుంది.ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు ఉంటుంది.
"""/" /
FZ-S V3లో మ్యాట్ బ్లాక్ షేడ్‌ని తిరిగి ప్రవేశపెట్టడం వల్ల షోరూమ్‌కు కస్టమర్లను ఆకర్షిస్తుంది.
రాబోయే నెలల్లో యమహా తన మోటార్‌సైకిళ్ల అమ్మకాలలో స్వల్ప పెరుగుదలను ఆశిస్తోంది.ఇక కొత్తగా తీసుకొచ్చిన కలర్ చాలామందిని ఆకర్షించే అవకాశం ఉంది.
ఎందుకంటే చూసేందుకు ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంది.
చికెన్ ఆరోగ్యకరమా? కాదా?