అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్…!

యాదాద్రి భువనగిరి జిల్లా: అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అదుపులో తీసుకుని,వారి నుండి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర గురువారం మీడియాకు వెల్లడించారు.

గోవా నుండి హైదరాబాద్ కు డ్రక్స్ తరలిస్తుండగా చౌటుప్పల్ మండలం తుప్రాన్ పేట వద్ద పోలీసులు పట్టుకున్నారని అన్నారు.

నిందితుల్లో సయ్యన్ లాహరిని అరెస్ట్ చేసినట్లు,మరో నిందితుడు ఎడ్మడ్ దిలీప్ స్పెన్సర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నిందితుల నుండి ఏడు లక్షల తొంబై రెండు వేల విలువగల బ్లు కలర్డ్,ఎండిఏంఏ పిల్స్ డ్రగ్,కొకెయిన్,సింథటిక్ డ్రగ్ లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామన్నారు.

అల్లం టీ వ‌ర్సెస్ గ్రీన్ టీ.. రెండింటిలో ఏది బెస్ట్‌?