హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు వై ప్లస్ సెక్యూరిటీ

హైదరాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు( Madhavilatha ) వై ప్లస్ సెక్యూరిటీ నియామకం అయింది.

ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీపై( MIM Leader Asaduddin Owaisi ) బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వీఐపీ సెక్యూరిటీలో భాగంగా మాధవీలతకు సుమారు పదకొండు మందితో సెక్యూరిటీ ఏర్పాటైంది.

మాధవీలత వెంట ఆరుగురు సీఆర్పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీతో పాటు నివాసం వద్ద సెక్యూరిటీగా ఐదుగురు గార్డులు ఉండనున్నారు.

కాగా ప్రస్తుతం మాధవీలతకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించడం తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.

ఇండియా అనే దేశం ఉందా.. కొరియన్ టాక్సీ డ్రైవర్ డౌట్‌కు యువతి షాక్.. వీడియో వైరల్..