వివాదాస్పద కంటెంట్లకు చెక్ పెట్టేందుకు సరికొత్త ఫీచర్ తీసుకురానున్న ఎక్స్..!

ప్రపంచంలో సగానికి పైగా జనాభా సోషల్ మీడియా( Social Media )ను ఫాలో అవుతున్నారు.

ముఖ్యంగా చాటింగులు, షేరింగ్లు అనేవి ప్రధానంగా వాట్సప్, ఫేస్బుక్ లాంటి వాటి ద్వారానే ఎక్కువగా జరుగుతున్నాయి.

అయితే ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వ్యక్తులు ఎక్కువగా ఫాలో అయ్యేది మాత్రం ఎక్స్ (X).

ఈ ఎక్స్ ను రాజకీయ నాయకులు, పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఫాలో అవుతూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఇదంతా అందరికీ తెలిసిందే. """/" / గత కొంతకాలంగా కొన్ని వివాదాస్పద కంటెంట్లు అంతర్జాతీయ సమాజాన్ని ఇరకాటంలోకి నడుతున్నాయి.

ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పరిమాణాలన్నీ ఎక్స్ వేదికలో క్షణాల్లో అందుబాటులోకి వస్తు, వాటికి ఎక్స్ వేదిక కీలకంగా మారింది.

దీంతో ఎక్స్ లో ఎక్కువ మంది ఖాతాలు కూడా విపరీతంగా తెరుస్తున్నారు. """/" / ఎక్స్ లో విద్వేష పూరిత ప్రసంగాలు, మహిళలను లైంగికంగా వేధించడం, చివరకు పోర్న్ వీడియోలు లాంటివి పోస్ట్ అవుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తూ.

ఎక్స్ ప్రతిష్ట కూడా దెబ్బతింటోంది.దీంతో ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ ఎక్స్ కు భద్రత, రక్షణ కల్పించడం కోసం త్వరలోనే ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.

ఈ ఫీచర్ తో ఎక్స్ ఖాతాదారులకు మరింత రక్షణ కల్పించాలని ఎలాన్ మాస్క్( Elon Musk ) అనుకుంటున్నారు.

ఇక ఎక్స్ లో కంటెంట్, భద్రత నియమాలను అమలు చేయడం కోసం ట్రస్ట్ అండ్ సేఫ్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని నిర్మించనున్నారు.

అంటే వందకి పైగా కంటెంట్ మోడరేటర్లు ఎప్పటికప్పుడు కంటెంట్ భద్రతతో పాటు, అబ్యూజివ్ కంటెంట్లను తొలగిస్తారు.

ఇలాంటి కంటెంట్లు పోస్ట్ చేసే వారిని హెచ్చరిస్తారు.ఒకవేళ వినకపోతే ఖాతాను బ్లాక్ చేసేస్తారు.

ఈ భద్రతా నియమాలు అందుబాటులోకి వస్తే.విద్వేష పూరిత, వివాదాస్పద కంటెంట్లు, మత సంబంధిత వ్యవహారాల విపరీత ధోరణుల ప్రచారానికి అడ్డుకట్టపడుతుంది.

ఇక ఎక్స్ లో ఖాతా తెరవాలంటే కనీస వయసు 13 ఏళ్లుగా నిర్ధారించనున్నారు.

ఆరోగ్యానికి అండంగా ఉండే బిర్యానీ ఆకు టీ.. రోజుకో క‌ప్పు తాగితే ఏం జ‌రుగుతుంది?