Megastar Chiranjeevi : చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసిన రైటర్ ఎవరో తెలుసా..?

ఒకప్పుడు చిరంజీవి( Chiranjeevi ) వరుస సినిమాలతో మంచి హిట్లను అందుకున్నాడు.ముఖ్యంగా ఆయనను మెగాస్టార్ చేసిన డైరెక్టర్ మాత్రం కోదండరామిరెడ్డి అనే చెప్పాలి ఆయన డైరెక్షన్ లో చిరంజీవి దాదాపు 20 సినిమాలకు పైన చేశాడు.

అందులో చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్లు గా నిలిచాయి.ఇక చిరంజీవి యండమూరి వీరేంద్రనాథ్( Yandamuri Veerendranath ) రాసిన నవలలను ఆధారంగా చేసుకొని చేసిన సినిమాలతోనే భారీ సక్సెస్ లను అందుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే యండమూరి మీద నమ్మకంతో ఆయనని డైరెక్టర్ గా మార్చి స్టువర్టుపురం పోలీస్ స్టేషన్( Stuartpuram Police Station ) అనే సినిమా చేశారు.

అయితే ఈ సినిమా ను యండమూరి వీరేంద్ర నాథ్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదు.

ఆ విషయాన్ని యండమూరి గారే స్వయంగా ఒప్పుకున్నారు. """/" / ఎందుకంటే తనకి డైరెక్షన్ పరంగా పెద్దగా అనుభవం లేకపోవడం వల్లే తను ఆ సినిమాని సక్సెస్ ఫుల్ గా డీల్ చేయలేకపోయానని, చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశానని తను చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పడం మనం చూశాం.

అయినా కూడా చిరంజీవి తనను ఏమీ అనకుండా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశాడు.

ఇక ఈ సినిమా ద్వారా తన ఖాతాలో ఒక భారీ ప్లాప్ అయితే వచ్చి పడింది.

అయినప్పటికీ చిరంజీవి మాత్రం ఇప్పటికీ యండమూరి తో మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు.

"""/" / ఇక మధ్యలో వీళ్ళ మధ్య కొన్ని క్లాషేష్ వచ్చినప్పటికీ రీసెంట్ గా మళ్లీ వీళ్ళు కలిసిపోయారనే విషయం ఒక వేదికగా చిరంజీవి చెప్పడం విశేషం.

ఇక అలాగే చిరంజీవి బయోగ్రఫీకి( Chiranjeevi Biography ) సంబంధించిన బుక్కును కూడా యండమూరి రాస్తాడని చిరంజీవి స్వయంగా చెప్పడం వీళ్ళ మధ్యనున్న ఫ్రెండ్షిప్ కి కోలామానం గా మనం చెప్పుకోవచ్చు.

ఇక ఇప్పటికీ కూడా చిరంజీవి యంగ్ హీరోలకి పోటీ ఇస్తు వరుస సినిమాలు చేస్తున్నాడు.

ఈ సింపుల్ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!