రాజశేఖర్ తన కథను దొంగతనం చేశాడంటూ దర్శకుడు ఫిర్యాదు
TeluguStop.com
యాంగ్రీ యంగ్ మన్ గత చిత్రం గరుడవేగ మంచి విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నటించిన కల్కి చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్ని ఏరియాల్లో కూడా భారీగా అమ్మేశారు.
విడుదలకు ముందే ఈ చిత్రం పాజిటివ్ బజ్‌ను దక్కించుకుంది.దాంతో సినిమా తప్పకుండా విజయాన్ని దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది.'కల్కి' చిత్రం 1980 కాలం నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెల్సిందే.
భారీ బడ్జెట్‌తో రాజశేఖర్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ స్క్రీన్‌ప్లేతో సినిమాను తెరకెక్కించడం జరిగింది.
రికార్డు స్థాయిలో అమ్ముడు పోయిన ఈ చిత్రం విడుదలకు అంతా సిద్దం చేస్తున్న సమయంలో అనూహ్యంగా చిత్ర కథ తనది అంటూ రచయిత కార్తికేయ మీడియా ముందుకు వచ్చాడు.
ఈయన గతంలో రాజశేఖర్‌తో ఒక సినిమాను తీశాడు.ఆ సమయంలోనే కల్కి చిత్ర కథ చెప్పాను అని, దాన్ని రాజశేఖర్ దొంగిలించి ప్రశాంత్ వర్మకు ఇచ్చి కల్కి సినిమా తీయించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
"""/"/
తనకు న్యాయం చేసే వరకు ఊరుకోను అని, పోలీసుల వద్దకు కూడా వెళ్లబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
దర్శకుల సంఘంలో ఇప్పటికే ఫిర్యాదు చేశాను అని, హైకోర్టు వరకు అయినా వెళ్లి సినిమా విడుదలపై స్టే తీసుకు వస్తానంటూ బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు.
ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ఈ రచయిత ఇప్పుడే ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు, పబ్లిసిటీ కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కల్కి చిత్ర యూనిట్ సభ్యులు ఎదురు దాడి చేస్తున్నారు.
ఈయన వల్ల ఏమైనా కల్కి చిత్రం వాయిదా పడనుందా అనేది చూడాలి.
రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిన ప్రముఖ నటీనటులు వీళ్లే!