తమ బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించిన ఆర్సీబీ.. సోఫీ డివైన్ కు ఒక్క పరుగుతో సెంచరీ మిస్..!

తాజాగా గుజరాత్ జెయింట్స్ - ఆర్సీబీ మధ్య జరిగిన బ్యాచ్ లో బెంగుళూరు జట్టు( RCB ) బ్యాటర్లు స్టేడియంలో పరుగుల వర్షం కురిపించారు.

ప్రతి ఓవర్లో బౌండరీలు బాదుతూ తమ బ్యాటింగ్ సత్తా ఏంటో తొలిసారిగా చూపించారు.

గుజరాత్ జెయింట్స్( Gujarat Giants ) ఇచ్చిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగుళూరు జట్టు రెండు వికెట్లు కోల్పోయి 15.

3 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది.సోఫీ డివైన్( Sophie Devine ) ఫోర్లతో , సిక్స్ లతో చెలరేగి సందడి చేసింది.

కేవలం 36 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సులతో 99 పరుగులు చేసింది.

కానీ ఒక్క పరుగు తేడా తో సెంచరీ మిస్ చేసుకుంది.సెంచరీకి ఒక్క పరుగు ఉండగా అవుట్ అవ్వడం బాధాకరం.

ఆ ఒక్క పరుగు చేసి ఉంటే ఓ అరుదైన రికార్డు ఖాతాలో పడేది.

"""/" / కెప్టెన్ స్మృతి మందాన( Smriti Mandhana ) 31 బంతులలో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ తో 37 పరుగులు చేసింది.

ఎలీస్ పెరీ 12 బంతుల్లో మూడు ఫోర్లు కొట్టి 19 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచింది.

హీథేర్ నైట్ 15 బంతుల్లో నాలుగు ఫోర్లు కొట్టి 22 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.

అయితే గుజరాత్ జట్టు కూడా 20 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 108 పరుగులు చేసింది.

లౌరా వోల్వార్ట్ 42 బంతుల్లో 68 పరుగులు, యాష్లె గర్డ్నార్ 26 బంతుల్లో 41 పరుగులు చేశారు.

"""/" / బెంగళూరు జట్టు జరిగిన ఏడు మ్యాచ్లలో వరుసగా ఐదు మ్యాచ్లు ఓడి చివరి రెండు మ్యాచ్లలో విజయం సాధించింది.

రన్ రేట్ చాలా దారుణంగా ఉండడంతో, రన్ రేట్ పెంచుకోవడం కోసం, ప్లే ఆఫ్ లో అర్హత సాధించడం కోసం కీలక మ్యాచ్లో తన సత్తా చాటింది.

కానీ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతం లీగ్ టేబుల్ లో ముంబై ఇండియన్స్ మొదటి స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ రెండవ స్థానంలో, యూపీ వారియర్స్ మూడవ స్థానంలో ఉన్నాయి.

బెంగుళూరు జట్టు, గుజరాత్ జెయింట్స్ జట్లు నాలుగైదు స్థానాలలో కొట్టుమిట్టాడుతున్నాయి.

బాలకృష్ణకు వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ.. లాగేసుకున్న సీనియర్ ఎన్టీఆర్..?