వావ్.. వాటే ఐడియా.. ఆటోను మాములుగా రీమోడల్ చేయలేదుగా?

ప్రస్తుత సమాజంలో ఎవరికి వారు వినూత్న ఆలోచనలు, వినూత్న టాలెంట్ లు ఉన్న సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చాలామంది వారి టాలెంట్లను నిరూపించుకోవడానికి సోషల్ మీడియా వేదికగా అనేక విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో వివిధ రకాల వాహనాలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా చెక్కర్లు కొడుతూనే ఉంటాయి.

కొంతమంది వారు ఉపయోగించే బైక్ ను ఆటో లాగా, ఆటోను కారు లాగా మార్చుకొని అందర్నీ ఆకర్షిస్తూ ఉంటారు.

అచ్చం అలాంటి సంఘటనని ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

"""/" / ఒక ఆటో డ్రైవర్ తన ఆటో రూపు రేఖలు మార్చిన విధానం చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

ఆటో డ్రైవర్ ప్రయాణికులను తీసుకెళ్తూ రోడ్డుపై అందర్నీ ఆకట్టుకుంటూ ఉన్నాడు.వాస్తవానికి ఆటోలో మనుషులను తీసుకెళ్లడం ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా.

? లేదు అతడి ఆటో ఆకారం చూసి అందరూ షాక్ అవుతున్నారు.సాధారణంగా మనకు తెలిసినది ఏమిటి అంటే.

ఆటో పైకప్పు గుండ్రంగా ఉంటుంది.కానీ ఈ ఆటో మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉండడంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

"""/" / ఆటో పైకప్పు గుండ్రంగా ఉండవలసింది కాస్త ఫ్లాట్ గా ఉండడంతో.

చూడడానికి అచ్చం కారు పైకప్పులాగా కనిపించడంతో రోడ్డుపై ఉన్నవారు అందరూ కూడా ఆ ఆటోను వింతగా చూడడంతో పాటు ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.

ఇక మరి కొందరు అయితే ఆ ఆటో డ్రైవర్ టాలెంట్ గురించి మాట్లాడుతూ ఉంటే.

మరికొందరు ఆటో డ్రైవర్ దగ్గరకు వెళ్లి మరి ఆటోను ఇలా ఎందుకు మార్చాడన్న విషయాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు.

ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

వావ్.వాటే ఐడియా అని కామెంట్స్ చేస్తూ ఉంటే.

మరికొందరు, ఫ్యూచర్లో ఇలాంటి ఆటోలని రోడ్డుపై తీసుకొని వస్తారేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

నేను ధనవంతురాలిని కాదు….నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది: సాయి పల్లవి