వావ్... క్రికెట్ లో ఫీల్డింగ్ ఇలా కూడా చేయొచ్చా?

క్రికెట్ అనేది జెంటిల్ మెన్ గేమ్.ఎప్పుడు మ్యాచ్ ఎలా ఎప్పుడు మారిపోతుందో మనం చెప్పలేం.

అందుకే మ్యాచ్ చివరి వరకు మ్యాచ్ విజేత ఎవరో నిర్ణయించడం చాలా కష్టం.

మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రతి ఓవర్ పరుగుల వరద పారించాలని బ్యాట్స్ మెన్ వ్యూహాలు రచిస్తారు, బౌలర్ బ్యాట్స్ మెన్ వికెట్లు తీయడానికి రకరకాల బాల్ లను సంధిస్తూ బ్యాట్స్ మెన్ స్పందిస్తూ ఉంటారు.

అయితే ఇంత ఉత్కంఠను కలిగించే మ్యాచ్ లో ప్లేయర్ లు చేసే విన్యాసాలు అభిమానులకు నవ్వులు పోయిస్తాయి.

ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నా ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతున్న సమయంలో ఈ తరహా ఘటనలు అభిమానులకు నవ్వులు పూయిస్తున్నాయి.

తాజాగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ చేసిన ఫీల్డింగ్ మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్ళనే కాక టీవీల ముందు ఉత్కంఠగా మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులను కూడా నవ్వులు పూయించింది.

క్రునాల్ పాండ్యా వేసిన బాల్ కు వార్నర్ బౌండరీ వైపు బాల్ ను బాదడంతో బౌల్ట్ ఆ బాల్ ను ఆపడానికి ఆగమాగం అయ్యాడు.

ఆ బాల్ ను అందుకునే క్రమంలో ఇక బ్యాలెన్స్ తప్పి క్రింద పడ్డాడు.

చివరికి ఆ బాల్ బౌండరీని తాకింది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

నెటిజన్ల కామెంట్స్ తో మరింత వైరల్ గా మారిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.

రోడ్డు ప్రమాదానికి గురైన జబర్దస్త్ లేడీ కమెడియన్… ముప్పు తప్పిందిగా?