వావ్: ఒక్క టొమోటో చెట్టుకి 839 కాయలు.. ఎలా అంటే..?

టొమోటో లేనిదే కూర లేదు.ప్రతి కూరలోను టొమోటో వేయాలిసిందే.

ఏ కూరగాయ ఇంట్లో ఉన్నా లేకపోయినా టొమోటో మాత్రం ఉండి తీరాలిసిందే.అయితే ప్రస్తుత పరిస్థితులలో దేశంలో టమోటా ధరలు బెంబేలెత్తిపోతున్నాయి.

ఒకప్పుడు కిలో టొమోటో 20 రూపాయలుగా ఉండగా ఇప్పుడు కిలో టమోటోలు 60 రూపాయిల దాక ఉన్నాయి.

సామాన్యులకు సైతం టొమోటో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.మరికొద్ది రోజుల్లో కేజీ టమోటోలు వంద రూపాయిలు అయినా ఆశ్చర్యపోవాలిసిన పని లేదు.

సాధారణంగా ఒక టొమోటో చెట్టుకు 15 నుంచి 20 వరకు టొమోటో కాయలు కాస్తాయి.

కానీ ఒక వ్యక్తి మాత్రం ఒక టొమోటో చెట్టుకు ఏకంగా 839 కాయలు పండించాడు.

ఏంటి ఒక్క చెట్టుకు అన్ని కాయలు ఎలా పండాయి అని షాక్ అయ్యారా.

? కానీ ఇది నిజం.ఒక వ్యక్తి కొత్త పద్ధతుల్లో సాగు చేయడంతో ఇలా ఒక టొమోటో చెట్టుకు ఏకంగా 839 కాయలు కాశాయి.

అసలు వివరాల్లోకి వెలితే.ఇంగ్లాండ్‌కు చెందిన డగ్లస్ స్మిత్ అనే వ్యక్తి ఇలా ఒకే చెట్టుకి 839 చెర్రీ టొమోటో కాయలను పండించి రికార్డును సాధించాడు.

చెర్రీ టమోటాలుగా పిలిచే ఈ కాయలను స్నాక్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారట .

డగ్లస్ స్మిత్ గతంలో ఐటీ జాబ్‌ చేసేవాడు.కానీ ఇప్పుడు ఆ ఉద్యోగం వదిలేసి వ్యవసాయం మీద మక్కువతో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు.

కొత్త పద్దతుల ద్వారా పంటను సాగు చేసే విధానంను కనుగొని చెర్రీ టమోటా పంటను సాగు చేయడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే గ్రీన్ హౌస్ పద్దతిలో చెర్రీ టమోటోలను సాగు చేసి ఇలా ఒకే చెట్టుకు 839 టమోటోలను పండించాడు.

అయితే ఈ టమోటోలను అక్కడి వారు చెర్రీ టొమోటోలుగా పిలుస్తారట.ఇవి చూడడానికి కొంచెం చిన్నగా, భలే ముద్దుగా ఉంటాయి.

మాములు మన టొమోటోలు కన్నా కొద్దిగా చిన్నగా ఉంటాయి.ఏవి అయితేనే టొమోటోలే కదా.

ఒక చెట్టుకి ఇన్ని టమోటోలు పండడం అంటే మాములు విషయం కాదు.ఈ పద్ధతి ఏదో భలే బాగుంది కదా.

నాని కోసమే కథ రాసుకున్న బలగం వేణు…అసలు మ్యాటరేంటంటే..?