ఈ ఆటో డ్రైవర్ టెక్నాలజీని ఎలా వాడేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..?
TeluguStop.com
బెంగళూరు ( Bengaluru )నగరం స్టార్టప్‌లకు, సరికొత్త టెక్నాలజీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
ఇక్కడ చాలా మంది ప్రజలకు టెక్నాలజీ గురించి బాగా అవగాహన ఉంటుంది.సోషల్ మీడియా( Social Media )లో బెంగళూరులో స్మార్ట్ పీపుల్ తరచుగా వైరల్ అవుతుంటారు.
వీరిని నగర వాసులే ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు.బెంగళూరు నగరం టెక్నాలజీకి కేంద్రంగా అని చెప్పుకోవచ్చు.
"""/" /
అయితే ఇప్పుడు బెంగళూరులోని ఒక ఆటో డ్రైవర్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యాడు.
ఎందుకంటే ఆయన తన స్మార్ట్‌వాచ్‌లో ఒక QR కోడ్ చూపించి, కస్టమర్ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్న ఫోటో వైరల్ అయింది.
ఈ ఫోటోకి "ఆటో అన్న కూడా బెంగళూరులో ఎంత స్టైలిష్‌గా డబ్బు తీసుకుంటాడో చూడండి" అని క్యాప్షన్ ఇచ్చారు.
అంటే, ఆ ఆటో డ్రైవర్ చాలా మోడర్న్‌గా, స్మార్ట్ గా మనీ రిసీవ్ చేసుకుంటున్నాడు.
ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లెవెల్ లో అతడి థాట్స్ ఉన్నాయి. """/" /
ఆ ఆటో డ్రైవర్ ఫోటో చూసి చాలా మంది అబ్బురపడ్డారు.
వాళ్లు సోషల్ మీడియాలో ఆయన్ను తెగ పొగిడేశారు.ఒకరు, "ఆటో అన్న మనందరికంటే చాలా స్మార్ట్" అని వ్యాఖ్యానించారు.
మరొకరు, "ఆయన ఇప్పుడు చాలా స్మార్ట్ అయిపోయారు" అన్నారు.మరికొందరు బెంగళూరు సిటీ చాలా ప్రత్యేకమైనదని చెప్పారు.
"బెంగళూరులో ఏం జరిగినా ఆశ్చర్యపడక్కరలేదు" అని కూడా కొందరు అన్నారు.మరొకరు, "డిజిటల్ ఇండియా( Digital India ) మనకు ఇలాంటి మార్పులను తెస్తోంది" అని కామెంట్ చేశారు.
ఇంకొందరు, "ప్రస్తుత కాలానికి తగిన పరిష్కారం ఇదే" అని అన్నారు.చివరగా, "బెంగళూరు ఎందుకు భారతదేశపు సాంకేతిక నగరమో ఇప్పుడు అర్థమవుతోంది" అని కూడా కొందరు పేర్కొన్నారు.
ఇదేందయ్యా ఇది.. నకిలీ యూట్యూబ్ ప్లే బటన్?