పాక్- చైనా బంధంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. మేం సమర్ధించలేమన్న అమెరికా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.చైనా, పాక్‌లను వేర్వేరుగా వుంచాలన్నది భారత లక్ష్యమని.

కానీ మీరు (కేంద్రం) ఆ రెండు దేశాలను కలిసేలా చేశారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

వీటిపై అమెరికా స్పందించింది.రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ను మీడియా ప్రశ్నించింది.

పాకిస్థాన్‌, చైనా మధ్య బంధం గురించి ఆ రెండు దేశాలకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు.

అయితే ఆ వ్యాఖ్యలను మేం కచ్చితంగా సమర్థించలేమని నెడ్ ప్రైస్ బదులిచ్చారు.ఇదే సమయంలో పాకిస్థాన్‌ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని.

ఆ దేశంతో తమకు కీలకమైన బంధం ఉందని ప్రైస్‌ చెప్పడం గమనార్హం.ఇక లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.

మోడీ సర్కార్‌ తీరుపై విరుచుకుపడ్డారు.ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలకు ఒక్క విదేశీ అతిథిని ఎందుకు తీసుకురాలేకపోయారో ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ ఆయన హితవు పలికారు.

అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ నేడు ఒంటరిగా మిగిలిపోయిందని.బయటి శక్తుల నుంచి మనదేశానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది అని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో 48 శాతం మంది ప్రజల ఆదాయం పడిపోయిందని.చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను నాశనం చేశారని రాహుల్ ఆరోపించారు.

దేశంలోని పేదలను కొల్లగొట్టి.ధనవంతులకు పంచుతున్నారంటూ ఆయన మండిపడ్డారు.

రాహుల్ వ్యాఖ్యలకు ఆ వెంటనే కౌంటరిచ్చారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.

1970ల కాలం నుంచి పాక్- చైనాల మధ్య అణు సహకారం వుందని.చైనా- పాక్ ఎకనమిక్ కారిడార్ 2013లోనే ప్రారంభం అయ్యిందంటూ జైశంకర్ గుర్తుచేశారు.

అందువల్ల మీరే ప్రశ్నించుకోవాలంటూ కేంద్ర మంత్రి చురకలు వేశారు.

విశ్వం భర సినిమా కోసం భారీ సాహసం చేస్తున్న చిరంజీవి…