అమెరికా చరిత్రలోనే చెత్త అధ్యక్షుడు .. జో బైడెన్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌( Joe Biden )పై మండిపడ్డారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

దేశ చరిత్రలోనే బైడెన్ అత్యంత చెత్త అధ్యక్షుడంటూ దుయ్యబట్టారు.ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి వివాదాస్పద సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, ప్రొఫెషనల్ రెజ్లర్ లోగాన్ పాల్‌తో( Logan Paul ) ట్రంప్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

పాల్, మరో కో హోస్ట్ మైక్ మజ్లాక్‌లతో మాట్లాడిన ట్రంప్.తన ప్రత్యర్ధి జో బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌, పలువురు విదేశీయులు, ర్యాప్ బీఫ్ వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"""/" / వ్యాపార రికార్డులను తప్పుదారి పట్టించినందుకు న్యూయార్క్ హష్ మనీ ట్రయల్‌లో తనను దోషిగా నిర్ధారించినప్పటికీ తాజా పోడ్‌కాస్ట్ ‘ఇంపాల్సివ్ ’ యువ జనాభాను ఆకట్టుకోవడానికి ట్రంప్‌కు అనువైన వేదికగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ సోషల్ మీడియా స్టార్‌తో దాదాపు గంటసేపు జరిగిన సంభాషణలో పాల్గొనడానికి ముందు ట్రంప్ .

ఎరుపు, తెలుపు, నీలం రంగుల్లో అలంకరించబడిన గదిలోకి వెళ్లారు.పాల్ ఎనర్జీ డ్రింక్ సీసాలు కూడా MAGA ( Make America Great Again ) ప్యాకేజింగ్‌తో ఉన్నాయి.

ఈ సందర్భంగా ట్రంప్ “NEVER SURRENDER.” అనే నినాదంతో కూడిన టీ షర్ట్, మగ్‌షాట్‌, రెడ్ MAGA టోపీలు ఇతర వస్తువులను బహుమతిగా ఇచ్చాడు.

"""/" / ఈ ఇంటర్వ్యూలో మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ఎజెండాను డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) పునరుద్ఘాటించారు.

బైడెన్ తాను అనుకున్నది సాధించలేడని ఎద్దేవా చేశారు.ఆ వ్యక్తి మనదేశాన్ని నాశనం చేస్తాడని , అతను చాలా చెడ్డవాడని, అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అంతిమంగా పాల్ బ్రదర్ ఎండార్స్‌మెంట్‌ , ట్రంప్‌ను కూల్‌గా చిత్రీకరించడం నెటిజన్లను బలంగా తాకింది.

జూన్ 14న ట్రంప్ పుట్టినరోజుకు ముందు ఈ వీడియో హైలైట్‌గా నిలిచాయి.ఇది రాబోయే సీఎన్ఎన్ చర్చపై అంచనాలను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

జూన్ 27న జాతీయ వేదికపై ట్రంప్ - బైడెన్‌లు ఒకరినొకరు ఎదుర్కోనున్నారు.పాల్‌తో డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ముఖ్యంగా టిక్‌టాక్‌లో దాని అధికారిక విడుదల తేదీకి ముందు ప్రచారం చేయబడింది.

జూన్ 2న జరిగిన యూఎఫ్‌సీ ఈవెంట్‌కు హాజరైన ట్రంప్‌ మొదటి టిక్‌టాక్ వీడియో‌ వైరల్ అయ్యింది.

కొద్దిగంటల్లోనే 100 మిలియన్లకు పైగా వీక్షణలు, 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు వచ్చారు.

వీడియో: ఆకాశంలో ఆశ్చర్యపరిచే దృశ్యం.. మేఘాల్లో నడుస్తున్న మనిషి..??