కార్తీక మాసంలో పరమశివుడికి ఇలా పూజిస్తే అన్ని శుభ ఫలితాలే!

హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు.ఈ క్రమంలోనే కార్తీకమాసంలో ఆ పరమేశ్వరుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు.

ఈ మాసంలో శివునికి పూజలు చేయటం విశేషమైన ఫలితాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇక కార్తీక మాసంలో వచ్చే సోమవారాలలో పరమశివుడినిపూజించడం వల్ల ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

అయితే కార్తీక సోమవారం పరమ శివుడికి ఇలా పూజ చేయడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి.

కార్తీక సోమవారాలలో పరమశివుడికి ఆవుపాలతో అభిషేకం చేయటం వల్ల సర్వ దుఃఖాలు తొలగిపోతాయి.

అదేవిధంగా దీర్ఘకాలికంగా వెంటాడుతున్న వ్యాధుల నుంచి విముక్తి పొందాలంటే కార్తీక సోమవారం శివునికి ఆవు పాలతో అభిషేకం చేయాలి.

శివారాధనకు గంగాజలానికి ఎంతో అనుబంధం ఉంది.శివుడికి గంగా జలంతో అభిషేకం చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి.

అలాగే దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. """/"/ చాలామంది శని దోషంతో బాధపడుతుంటారు.

ఇలా శనిదోషం లేదా కాలసర్పదోషాలతో బాధపడేవారు శివ ధ్యానం చేయటం ఎంతో మంచిది.

అదేవిధంగా శత్రుభయం ఉన్నవారు శత్రు బాధలు తొలగిపోవాలంటే మహా మృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో జపించి పూజించడం వల్ల ఏ విధమైనటువంటి ఆపదలు లేకుండా ఉండడమే కాకుండా బాధలు తొలగిపోయి మృత్యు భయం తొలగిపోతుంది.

ఇలా కార్తీక సోమవారం పరమ శివుడిని పూజించడం వల్ల సకల సుఖాలు, సుఖసంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

సిద్దు జొన్నలగడ్డ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతుంది…