తెల్ల అన్నంతో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
TeluguStop.com
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవతలను పూజించి స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ.
ఈ క్రమంలోనే భక్తులు ఎన్నో రకాల నైవేద్యాలను తయారుచేసే దేవుడికి సమర్పిస్తుంటారు.అయితే తెల్ల అన్నాన్ని వివిధ రకాల నైవేద్యంగా తయారుచేసి దేవుళ్లకు సమర్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
తెల్ల అన్నాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించి పశువులకు పెట్టడం వల్ల మన ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటు ఉండదు.
అలాగే తెల్ల అన్నంలోకి తేనెను కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారో అలాంటి వారికి ఏ విధమైనటువంటి అనారోగ్యం సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.
తెల్ల అన్నంలోకి శనగపప్పు వేసి పాయసం చేసి కుల దైవానికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఇంట్లో ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా, మనశ్శాంతితో సంతోషంగా గడుపుతారని పండితులు చెబుతున్నారు.
అలాగే శని ప్రభావ దోషమున్నవారు తెల్ల అన్నానికి నువ్వులు కలిపి శనీశ్వరునికి నైవేద్యంగా సమర్పించాలి.
"""/"/అదేవిధంగా కాకులకు పిండప్రదానం చేయడం వల్ల శని ప్రభావం దోషాలు తొలగిపోవడమే కాకుండా పితృ శాపాలు కూడా తొలగిపోతాయి.
ఇకపోతే తెల్ల అన్నంతో శివలింగాన్ని తయారుచేసి పూజించిన తర్వాత అన్నంతో తయారు చేసిన శివలింగాన్ని నదిలో వదిలి రావడం వల్ల మన ఇంట్లో సంపదకు ఏలోటు ఉండదు.
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.ఇలా దేవతలకు నైవేద్యం సమర్పించడం వల్ల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
చలికాలంలో చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచే న్యాచురల్ ఫేస్ ఆయిల్ మీ కోసం..!