ఆదివారం సూర్య భగవానుడికి పూజించి… అవి తీసుకుంటే..!

ఆదివారం సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు.ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

సమస్త లోకానికి అధిపతి అయిన సూర్యునికి భక్తిశ్రద్ధలతో ప్రతిరోజు పూజించడంవల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

నవగ్రహాలకు అధిపతిగా సూర్యుడిని భావిస్తారు.కనుక ఆదివారం ఆ సూర్యభగవానుడినికి పూజించాలి.

అదేవిధంగా ఆదివారం ఎటువంటి ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్న సమయంలో లేదా కొత్త పని ప్రారంభించేటప్పుడు ఆ పని విజయవంతం కావాలంటే తప్పకుండా ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో చక్కెర వేసుకొని తాగి బయటకు వెళ్లడం వల్ల అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి.

పని నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం మాంసాహారాన్ని తీసుకోకూడదు.వీలైనంతవరకు నల్ల ఆవుకు ఆహారం పెట్టడం ద్వారా శుభ ఫలితం కలుగుతుంది.

అదే విధంగా బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి.ఆదివారం ఎవరి వద్ద నుంచి ఎలాంటి బహుమతులను ఉచితంగా తీసుకోకూడదు.

ఒక్క తల్లిదండ్రుల నుంచి తప్ప.ఇతరుల వద్ద నుంచి ఏ వస్తువును స్వీకరించకూడదు.

ప్రతి ఆదివారం ఈ విధంగా చేయటం వల్ల రవి దోషాలు తొలగిపోతాయి.అనారోగ్య సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో సంతోషంగా గడుపుతారు.

ఆదివారం కేవలం సూర్యారాధనతో పాటు, నవగ్రహారాధన చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి.పూర్వం బ్రహ్మదేవుడు తన సృష్టిని విస్తరించాలని భావించాడు.

ఇందులో భాగంగానే భూమిపై సప్తఋషులను సృష్టించాడు.ఈ సప్తర్షులలో ఒకరే మరచి.

ఇతనికి కాశి అనే కుమారుడు జన్మించాడు.కాశి అనే వ్యక్తికి 13 మంది భార్యలు.

కాశీ మొదటి భార్యకు పుట్టిన సంతానమే అతిథి ఈ అతిథికి జన్మించినవాడే సూర్య భగవానుడు.

కనుక ఈ ప్రపంచాన్ని కాపాడే బాధ్యతలను నవగ్రహాలకు అప్పగించారు.నవ గ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు కావడంతో సూర్యారాధనతో పాటు నవగ్రహారాధన చేయడంవల్ల నవగ్రహ దోషాలు సైతం తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

నన్ను వెంటాడే ఎమోషన్ నువ్వు… ఆసక్తికర పోస్ట్ చేసిన ఎన్టీఆర్!