నిర్జల ఏకాదశి రోజు విష్ణు దేవుడికి పూజ విధానం.. పాటించాల్సిన నియమాలు?

మన హిందూ ఆచారాల ప్రకారం ఏకాదశి తిథి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు.ఏకాదశి రోజులలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.

ఈ విధంగా సంవత్సరంలో మనకు 24 ఏకాదశులు.ప్రతి నెల కృష్ణ పక్షంలో ఒక ఏకాదశి, అదే విధంగా శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది.

ఈ విధంగా ఇరవై నాలుగు ఏకాదశులలో నిర్జల ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనదని, పవిత్రమైనదని చెప్పవచ్చు.

ఈ నిర్జల ఏకాదశి రోజు పూజ చేయటం వల్ల మిగిలిన 23 ఏకాదశులను పూజించిన ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు.

మరి ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

జేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు.ఏకాదశి ఆ విష్ణు దేవుడికి ఎంతో ప్రీతికరమైనది.

విష్ణు దేవుడికి ఎంతో ప్రీతికరమైన ఈ నిర్జల ఏకాదశి ఈరోజు భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల తప్పకుండా వారి కోరికలు నెరవేరుతాయని భావిస్తారు.

నిర్జల ఏకాదశి రోజున పూజ చేసేవారు కఠిన ఉపవాస దీక్షలతో పూజ చేయాలి.

కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకుండా పూజ చేయాలి.ఉపవాసం విడిచిన అనంతరం నీటిని తాగాలి.

అయితే ఈ నిర్జల ఏకాదశి వ్రతం బ్రహ్మ ముహూర్తంలో మొదలయ్యి అమృత కాలంలో ముగుస్తుంది.

"""/" / నిర్జల ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేసి నదీస్నానమాచరించి ఇంటిని శుభ్రపరచుకోవాలి.

అదేవిధంగా విష్ణు దేవుడి ఫోటోకి గంగా జలంతో అభిషేకం చేసి, ప్రత్యేక అలంకరణ చేసి దీపం వెలిగించాలి.

పూజలో భాగంగా స్వామివారికి పుష్పాలతో పాటు తులసీదళాలతో సమర్పించాలి.తులసీ దళాలు లేనిది విష్ణుపూజ అసంపూర్ణం.

పూజ అనంతరం విష్ణు సహస్రనామాలు పఠించాలి.ఈ విధంగా పూజ ముగిసిన తర్వాత స్వామివారికి కేవలం సాత్విక ఆహారం మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి.

ఈ నైవేద్యంలో రెండు తులసి ఆకులను వేసిన నైవేద్యం స్వామివారికి సమర్పించడం వల్ల స్వామి వారు మరింత ప్రీతి చెందుతారు.

ఎంతో పవిత్రమైన ఈ నిర్జల ఏకాదశి రోజు కేవలం విష్ణు దేవుడనీ మాత్రమే కాకుండా లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి6, సోమవారం 2025