మంత్రాల‌తో తానే చంపేశాన‌ని.. మ‌ళ్లీ బ‌తికిస్తాన‌ని శ‌వం ద‌గ్గ‌ర పూజ‌లు

ప్ర‌స్తుతం ఉన్న స‌మాజంలో మ‌నం ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నాం.ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాం.

ఇంకా చెప్పాలంటే నింగిలోకి ఎగిరి మ‌రీ ఎన్నో అద్భుతాలు చేసే వ‌ర‌కు మ‌న ప్ర‌యాణం వెల్తోంది.

కానీ ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో అయితే వెన‌క‌బ‌డే ఉన్నారు.చాలామంది ఇంకా మూఢ న‌మ్మ‌కాల్లోనే బతుకుతున్నార‌నే చెప్పాలి.

ఇక ఇలాంటి మూఢ న‌మ్మ‌కాల‌తో ఒక‌రిని ఒక‌రు దాడి చేసుకుంటూ చివ‌ర‌కు చంపేదాకా వెళ్తున్నాయి ఇలాంటి న‌మ్మ‌కాలు.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌గిత్యాల జిల్లాలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

అయితే ఇది కూడా మంత్రాల నెపం చుట్టూ తిరుగుతోంది.ఇంకా చెప్పాలంటే ఇది ఇంకో అడుగు ముందుకేసి ఆ మంత్రాలు చేసి చంపినట్టు ఒప్పుకున్న‌ వ్య‌క్తి కాస్తా చివ‌ర‌కు తానే మ‌ల్లీ బ్ర‌తికిస్తానంటూ చెప్ప‌డం సంచ‌ల‌నం రేపుతోంది.

దీంతో అంద‌రూ ఈ విష‌యం తెలిసి నింజ‌గానే షాక్ అవుతున్నారు.వివ‌రాల్లోకి వెళ్తే ఉమ్మ‌డి క‌రీనంగ‌ర్ జిల్లాలోని కొత్త జిల్లా అయిన జగిత్యాల రూరల్‌ మండలం టీఆర్‌ నగర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

స్థానికంగా నివాసం ఉంటున్న ఓర్సు రమేష్‌ అనే అనుకోకుండా మ‌ర‌ణించాడు.దీంతో ఆయ‌న మంత్రాల కారణంగానే మృతి చెందాడని భావించిన కుటుంబ స‌భ్యులు పుల్లయ్య అనే వ్యక్తిని చితక బాదార‌ని తెలుస్తోంది.

"""/"/ ఇక వీరి దెబ్బ‌ల‌కు త‌ట్టుకోలుక ఆ పుల్ల‌య్య అనే వ్య‌క్తి చివ‌ర‌కు రమేష్‌ని తానే మంత్రాల‌తో చంపేశానని ఒప్పుకున్నాడు.

అంతే కాదు తానే మ‌ల్లీ మంత్రాలతో బ్ర‌తికిస్తానంటూ ఈ రోజు ఉదయం నుంచి శవం దగ్గర పూజలు చేయడం స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది.

ఇక ఈ విషయం కాస్తా సోష‌ల్ మీడియా ద్వారా చివ‌ర‌కు పోలీసులకు చేరింది.

దీంతో వారు సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగారు.వెంట‌నే పుల్లయ్యను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.

అంతే కాదు రమేశ్‌ డెడ్‌బాడీని జగిత్యాల ప్ర‌భుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.