ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళన తీవ్రతరం

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా మహిళా రెజ్లర్లు నిర్వహిస్తున్న ఆందోళన తీవ్రరూపు దాల్చుతోంది.

ఈ క్రమంలో కేంద్రానికి మరో అల్టీమేటం ఇచ్చారు రెజ్లర్లు.రాష్ట్రపతి కానీ, ప్రధాని కానీ తమ సమస్యను పట్టించుకోకపోతే తమ పతకాలను గంగలో పడేస్తామని హెచ్చరించారు.

తక్షణమే బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.ఇన్ని రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాయంత్రంలోగా స్పందించని పక్షంలో ఆరు గంటలకు హరిద్వార్ లోని గంగలో పతకాలు విసిరేస్తామని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో ఇండియా గేట్ దగ్గర రెజ్లర్లు నిరాహార దీక్ష చేస్తున్నారు.

తండేల్ క్లైమాక్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారా..?