ఇదేం కుక్క బాబోయ్.. అత్యంత అసహ్యకరంగా ఉన్నా ఆ పోటీల్లో నెగ్గింది..

ముఖం నిండా కొబ్బరి పీచు లాంటి వెంట్రుకలు, వెక్కిరిస్తున్నట్లు ఒకవైపు వాలిపోయిన నాలుక, చచ్చుబడిపోయిన వెనుక కాళ్లు.

ఈ భౌతిక లక్షణాలన్నీ ఒక కుక్కలో ఉహించుకుంటే అది ఎంత వికారంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అలా అసహ్యంగా ఉండటమే ఒక కుక్కకి వరంగా మారింది.అది రీసెంట్‌గా డాగ్స్ పోటీల్లో రూ.

1 లక్ష ప్రైస్‌మనీతో పాటు ఒక ట్రోఫీ గెలుపొందింది.ఇంతకీ ఆ పోటీ పేరేంటంటే.

'వరల్డ్స్‌ అగ్లియస్ట్ డాగ్'.అందవిహీనంగా ఉన్న కుక్కల జీవితంలో ప్రేమ, ఆనందాన్ని నింపటమే ఈ కాంపిటీషన్‌ ముఖ్య ఉద్దేశ్యం.

"""/" / 2023 వరల్డ్స్‌ అగ్లియస్ట్ డాగ్ పోటీ( Worlds Ugliest Dog 2023 )ల్లో గెలిచిన ఈ అంద విహీనమైన కుక్క పేరు స్కూటర్( Scooter ఏడేళ్ల వయసున్న ఈ చైనీస్ క్రెస్టెడ్ జాతి కుక్క జూన్ 23న నిర్వహించిన పోటీల్లో గెలుపొందింది.

గత 50 ఏళ్లుగా కాలిఫోర్నియా( California)లో ఈ వరల్డ్స్‌ అగ్లియస్ట్ డాగ్ పోటీలను నిర్వహిస్తున్నారు.

అందంగా లేకపోయినా ఈ కుక్కలు తమ వైకల్యాన్ని అధిగమించి సంతోషంగా ఉండగలవని ఈ పోటీ ద్వారా నిర్వాహకులు తెలియజేస్తారు.

అలాగే వీటి పట్ల ప్రజలకు ప్రేమ పుట్టి వాటిని దత్తత తీసుకునేలా ప్రేరేపిస్తారు.

"""/" / అయితే ఈసారి ఛాంపియన్‌గా నిలిచిన స్కూటర్ డాగ్ చాలామంది హృదయాలను గెలుచుకుంది.

పుట్టుకతోనే వికారంగా జన్మించిన ఈ శునకాన్ని ఎవరూ చేరదీయరనే భావనతో రెస్క్యూ గ్రూప్‌కి చెందిన ఒక వ్యక్తి దీనిని దత్తత తీసుకున్నాడు.

ఏడు సంవత్సరాలు పాటు ఏలోటూ రాకుండా పెంచుకున్నాడు.ఈ సమయంలో లిండా ఎల్మ్‌క్విస్ట్ స్కూటర్‌ ఆరోగ్యాన్ని అడపాదడపా చెక్ చేస్తూ ఉండేది.

దానిని వెటర్నటీ డాక్టర్ల దగ్గరికి కూడా తీసుకెళ్లేది.ఒకానొక సమయంలో దీనిని తాను పోషించలేనని యజమాని తెలిపాడు.

దాంతో లిండా ఈ కుక్కను దత్తత తీసుకుంది.అప్పటినుంచి దానిని చక్కగా చూసుకుంటోంది.

ఫిజికల్ థెరపిస్టు సలహా మేరకు ఈ కుక్కకు ఒక కార్ట్ కూడా తయారు చేయించింది.

దాని సహాయంతో ఈ కుక్క అన్ని కుక్కలు లాగానే ఎక్కడికంటే అక్కడికి తిరుగుతుంది.

దళితులపై అధ్యయనాలు.. భారత సంతతి మహిళా ప్రొఫెసర్‌కు ‘యూఎస్ జీనియస్ గ్రాంట్ ’