న్యూజిలాండ్ బీచ్‌లో వింత తిమింగలం.. చూసి షాక్ అవుతున్న స్థానికులు..
TeluguStop.com
సముద్రంలో ఎన్నో వింత జీవులు ఉంటాయి.రకరకాల జాతులు చేపలు తిమింగలాలు కూడా ఉంటాయి.
తాజాగా న్యూజిలాండ్‌లోని( New Zealand ) తైరి మౌత్ సమీపంలో ఉన్న బీచ్ లో వింత తిమింగలం( Mysterious Whale ) ప్రత్యక్షం అయింది.
ఈ అరుదైన తిమింగలం చనిపోయి ఒడ్డున కొట్టుకువచ్చింది.ఈ ఘటన స్థానికులను మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ తిమింగలం ‘స్పేడ్ టూత్‌డ్ వేల్’( Spade-Toothed Whale ) అనే రకానికి చెందినదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
న్యూజిలాండ్ పర్యావరణ సంరక్షణ శాఖ ప్రకారం ఇది ప్రపంచంలోనే అరుదైన తిమింగలం. """/" /
మొదటిసారిగా 1872లో ఈ తిమింగలాన్ని గుర్తించారు.
ఈ తిమింగలం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీని పొడవు 16 అడుగులకు పైగా ఉంది.హెన్రీ ట్రావర్స్ అనే శాస్త్రవేత్త పేరు మీద దీనికి మెసోప్లోడాన్ ట్రావర్సీ అని పేరు పెట్టారు.
కానీ దీని గురించి పెద్దగా విషయాలు తెలియలేదు.దీనికి కొన్ని దంతాలు, ఒక దవడ ఎముక ఉంటుందని తెలిసింది.
ఈ తిమింగలం ఎలాంటి ఆహారం తింటుంది? ఎక్కడ నివసిస్తుంది? ఇలాంటివి ఎన్ని తిమింగలాలు ఉన్నాయి? అనే విషయాలు ఏమీ తెలియవు.
ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ తిమింగలం గురించి పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
ప్రపంచంలోనే అరుదైన తిమింగలం ఒకటి న్యూజిలాండ్‌లోని ఒటాగో( Otago ) ప్రాంతంలోని ఒడ్డున కొట్టుకువచ్చిందని పర్యావరణ సంరక్షణ శాఖ (DOC) సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ స్పేడ్ టూత్‌డ్ వేల్ అనే తిమింగలం చాలా అరుదుగా కనిపించే జీవి.
ఇప్పటివరకు కేవలం ఆరు తిమింగలాలు మాత్రమే కనిపించాయి.ఈ తిమింగలం చనిపోయి ఉండటం బాధాకరమైన విషయమే అయినప్పటికీ, ఈ అరుదైన జీవి గురించి మరింత తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం.
శాస్త్రీయంగా, సాంస్కృతికంగా, పరిరక్షణ పరంగా ఇది చాలా ముఖ్యమైన విషయం.1872లో తర్వాత, 1950లలో మరో స్పేడ్ టూత్‌డ్ వేల్ న్యూజిలాండ్‌లోనే కనిపించింది.
అదేవిధంగా 1986లో చిలీలో కూడా ఈ తిమింగలం ఎముకలు దొరికాయి.2002లో జరిపిన డీఎన్ఏ పరీక్షల ద్వారా అవి ఒకే జాతికి చెందినవే అని తేలింది.
అదేవిధంగా 2010, 2017 సంవత్సరాల్లో కూడా న్యూజిలాండ్‌లో ఈ తిమింగలాలు కనిపించాయి.
నా సోదరి మరణం తీవ్రంగా కలచివేసింది.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!