వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్.. 5000 మందిని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఇదేనట!

వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్ 5000 మందిని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఇదేనట!

ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్‌గా( Most Wanted Girlfriend ) చెప్పుకుంటున్న వెరా డిజ్క్‌మాన్స్( Vera Djikmans ) అనే 27 ఏళ్ల మోడల్ సంచలన విషయాలు వెల్లడించింది.

వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్ 5000 మందిని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఇదేనట!

ఏకంగా 55 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న ఈ అమ్మడు.తనను డేట్ చేయడానికి 5 వేల మందికి పైగా అబ్బాయిలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పి షాక్ ఇచ్చింది.

వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్ 5000 మందిని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఇదేనట!

అయితే, అందులో కేవలం ముగ్గురు మాత్రమే తన 'కఠినమైన' ప్రమాణాలకు సరిపోయారని, అందుకే బాయ్‌ఫ్రెండ్( Boyfriend ) వేటను తాత్కాలికంగా ఆపేశానని తెలిపింది.

"నాకు పర్‌ఫెక్ట్ అనిపించే అబ్బాయి కావాలి.అందుకే ఇంతమందిని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతానికి బాయ్‌ఫ్రెండ్ కోసం వెతకడం ఆపేశాను కానీ, మంచి ఆప్షన్ వస్తే మాత్రం వదులుకోను" అని వెరా చెప్పుకొచ్చింది.

అయితే ఇప్పుడు మాత్రం రిలేషన్ షిప్స్ కంటే.అమ్మాయిలకు డేటింగ్ టిప్స్ ఇవ్వడంపైనే ఈ హాట్ మోడల్ ఫోకస్ పెట్టింది.

"""/" / అమ్మాయిలు తమను తాము గౌరవించుకోవాలని, కొన్ని హద్దులు పెట్టుకోవాలని వెరా సూచిస్తోంది.

అబ్బాయిలు నిజంగా ఇష్టపడితే.డిన్నర్లు, యాక్టివిటీస్‌తో కూడిన ప్రాపర్ డేట్‌లను ప్లాన్ చేయాలని అంటోంది.

లాస్ట్‌ మినిట్‌లోనో, లేదంటే అర్థరాత్రి ప్లాన్‌ చేసే అబ్బాయిలను దూరం పెట్టమని చెబుతోంది.

అలా చేయడం అంటే అమ్మాయిలను వాళ్లు గౌరవించట్లేదని అర్థమని వెరా తేల్చి చెబుతోంది.

గిఫ్టులు ఇవ్వడం గురించి కూడా వెరా తన అభిప్రాయం చెప్పింది.అబ్బాయిలు చిన్న గిఫ్టులు తెచ్చినా అది అమ్మాయిలకు చాలా సంతోషాన్నిస్తుందంటోంది.

గతంలో లూయిస్ విట్టన్, హెర్మ్స్ లాంటి ఖరీదైన గిఫ్టులు వచ్చినా, సింపుల్‌గా పూలు ఇచ్చినా కూడా అమ్మాయిలు ఫిదా అయిపోతారని వెరా అంటోంది.

"ప్రతి అమ్మాయిని ఒక రాకుమారిలా చూడాలి" అని వెరా తన మనసులోని మాటను బయటపెట్టింది.

"""/" / రిలేషన్ షిప్స్‌లో రెడ్ ఫ్లాగ్స్ గురించి కూడా వెరా మాట్లాడింది.

రాత్రి 10 గంటల తర్వాత టెక్స్ట్ చేసేవాళ్లు, అబద్ధపు వాగ్దానాలు చేసేవాళ్లు, సరిగ్గా శుభ్రంగా ఉండనివాళ్లు, డబ్బు విషయంలో కేర్‌లెస్‌గా ఉండేవాళ్లను అమ్మాయిలు అస్సలు దగ్గరకు రానివ్వకూడదని వెరా హెచ్చరిస్తోంది.

"అలాంటి ప్రవర్తనలు మీకు వాళ్లు విలువ ఇవ్వట్లేదని చూపిస్తాయి" అని వెరా కుండబద్దలు కొట్టింది.

బాయ్‌ఫ్రెండ్ కోసం వెతకడంపై విమర్శలు వచ్చినా, వెరా మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు.

తన ఫ్యామిలీ మెంబర్‌తో పాటు, మేకప్ ఆర్టిస్ట్ కూడా తన పద్ధతిని చూసి జెలస్ ఫీలయ్యారని వెరా చెప్పింది.

కానీ చాలా మంది అమ్మాయిలు మాత్రం తన ఐడియాలను సపోర్ట్ చేస్తున్నారని ఈ హాట్ మోడల్ ధీమాగా చెబుతోంది.

పవన్ కళ్యాణ్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..?