వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ భగవంత్ కేసరి, డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ ప్రారంభం, జనవరి 28నమీ జీ తెలుగులో!

హైదరాబాద్,25జనవరి 2024:తెలుగు ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్స్తోఅలరించే జీ తెలుగు( Zee Telugu ) ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమైంది.

థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ ఆదివారం అందిస్తోంది.

అంతేకాదు, తెలుగు ప్రేక్షకులను బుల్లితెర, వెండితెరపై అలరిస్తున్న తారలు తమ జోడీతో కలిసి జంటగా తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు సూపర్ జోడీ వేదికను అందిస్తోంది జీ తెలుగు.

నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మరియుమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగాసూపర్ జోడి ప్రారంభం, ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు, జీ తెలుగులో మాత్రమే!సక్సెస్ఫుల్ నాన్ఫిక్షన్ షోలతో అలరించిన జీ తెలుగు ఈ ఆదివారం సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ జోడిని ప్రారంభిస్తోంది.

జీ తెలుగులో జనవరి 28న టాలీవుడ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగాప్రారంభం కానున్న సూపర్ జోడీ ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రముఖ యాంకర్ ఉదయ భాను జీ తెలుగు సూపర్ జోడి షోతో రీఎంట్రీ ఇవ్వనున్నారు.

ఈ షోకి న్యాయనిర్ణేతలుగా ఎవర్గ్రీన్ నటి మీనా( Meena ), ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘుమాస్టర్, హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ వ్యవహరించనున్నారు.

ఈ షోతో మీనా తెలుగు బుల్లితెరపై మొదటిసారి జడ్జిగా అలరించనున్నారు.రఘు మాస్టర్ కొరియోగ్రఫీ అనుభవం, శ్రీదేవి విజయ్ కుమార్( Sridevi Vijaykumar ) అందం ఈ షోని మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి.

ఇక, ఈ షోలో 8 మంది సెలబ్రిటీ జోడీలుతమఅద్భుతమైన ప్రదర్శనలతో హోరాహోరీగాటైటిల్ కోసం పోటీపడనున్నారు.

ఆ సెలబ్రిటీ జోడీలు ఎవరనేది తెలియాలంటే.ఉత్కంఠభరితమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న సూపర్ జోడి ఎపిక్ ప్రీమియర్ ఎపిసోడ్లు మీరూ తప్పక చూడండి!ప్రేక్షకులను మెప్పించి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన భగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా జీ తెలుగు అందిస్తోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందినఈ సినిమా కథ జైలు నుండి విడుదలైన మాజీ పోలీస్ అధికారి నేలకొండ భగవంత్ కేసరి(బాలకృష్ణ) ( Balakrishna )పాత్ర చుట్టూ తిరుగుతుంది.

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలప్రధాన పాత్రల్లో నటించగా అర్జుల్ రాంపాల్, పి.

రవిశంకర్, ఆర్.శరత్ కుమార్, రఘుబాబు ఇతర కీలకపాత్రల్లో నటించారు.

యాక్షన్, ఎమోషన్స్, కెమిస్ట్రీ అన్నింటి మేళవింపుగా సాగిన భగవంత్ కేసరి సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా మీ జీ తెలుగులో ఈ ఆదివారం సాయంత్రం 5.

30 గంటలకు ప్రసారం కానుంది.ఈ సందర్భంగా జీ తెలుగు ‘బనావో బేటీకో షేర్’ కాంటెస్ట్ని నిర్వహించనుంది.

ఆడపిల్లల్ని పులిలా పెంచుతున్న తల్లిదండ్రులకి జోహర్లు చెబుతూ నిర్వహిస్తున్న ఈ కాంటెస్ట్లో పాల్గొనాలంటే భగవంత్ కేసరి సినిమా చూస్తూ మీ కూతురితో సెల్ఫీ తీసి టీవీలో కనిపించే ఫోన్ నంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాలి, లేదా స్క్రీన్పై కనిపించే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి సెల్ఫీని పంపించాలి.

ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు సర్ప్రైజ్ గిఫ్ట్నిపొందుతారు.భగవంత్ కేసరి సినిమా చూడండి.

మీరు కూడా ఈ పోటీలో పాల్గొనండి, మీ జీ తెలుగులో! .

ఆ టాలీవుడ్ హీరోతో రష్మిక పెళ్లి పిక్స్… గుడ్ న్యూస్ చెప్పేసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్?