ప్రపంచంలోనే అత్యంత సన్నని హోటల్.. ఒక ఫ్లోర్‌కు ఒక రూమ్ మాత్రమే..!
TeluguStop.com
ఈ ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన హోటల్స్ ఉన్నాయి.వాటిలో ఒకటి పిటూరూమ్స్ (PituRooms).
ఇది ఇండోనేషియాలోని సెంట్రల్ జావాలోని సలాటిగా( Salatiga ) అనే చిన్న పట్టణంలో ఉంది.
దీనిలో ఒక ప్రత్యేకత ఉంది.ఆ ప్రత్యేకత కారణంగా దానికి ప్రజలు "ప్రపంచంలోని అత్యంత సన్నగా ఉండే హోటల్" అని ఒక పేరు కూడా పెట్టారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ హోటల్ వెడల్పు 2.8 మీటర్లు మాత్రమే.
అంటే దాదాపు తొమ్మిది అడుగులు.సరిగ్గా చెప్పాలంటే చిన్న రూమ్ అంత వెడల్పులోనే ఈ హోటల్ మొత్తం కట్టేశారు.
ఇందులో ఏడు గదులు ఉన్నాయి, ఒక్కొక్కటి ప్రత్యేకమైన డిజైన్, మౌంట్ మెర్బాబు వ్యూ ఆఫర్ చేస్తాయి.
"""/" /
ఈ హోటల్‌ను ఆర్కిటెక్ట్ ఆరీ ఇంద్ర నిర్మించారు, అతను తన స్వగ్రామం సంస్కృతిని ప్రదర్శించే కొత్త తరహా పర్యాటకాన్ని రూపొందించాలని కోరుకున్నాడు.
ఈ హోటల్( Hotel ) ఐదు అంతస్థుల భవనం, ఇది గతంలో ఖాళీగా వదిలేసిన ఒక ఇరుకైన స్థలాన్ని ఆక్రమించింది.
ప్రతి గదిలో డబుల్ బెడ్, షవర్, టాయిలెట్ ఉన్న బాత్రూమ్, రూమ్ థీమ్‌ను ప్రతిబింబించే స్థానిక కళాకృతులు ఉన్నాయి.
ఆ థీమ్‌ల్లో సలాటిగా, మెర్బాబు, జావా, ఇండోనేషియా, ఆసియా, వరల్డ్ , యూనివర్స్ ఉన్నాయి.
హోటల్ పై అంతస్తులో బార్, రెస్టారెంట్ కూడా ఉంది, ఇక్కడ అతిథులు పర్వతం, పట్టణం వైడ్ వ్యూను ఆస్వాదించవచ్చు.
ఈ హోటల్‌లో ఒక ఫ్లోర్‌కు ఒక రూమ్ మాత్రమే ఉంటుంది. """/" /
తన సొంత బృందంతో కలిసి పిటూరూమ్స్‌ను డిజైన్ చేసి నిర్వహిస్తున్నానని, హోటల్‌ను నిర్మించడంలో చాలా సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆరీ ఇంద్ర చెప్పారు.
సైజు, లగ్జరీపై దృష్టి సారించే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ( Hospitality Industry ) సాంప్రదాయ ఆలోచనను తాను అధిగమించి, స్థల పరిమితిని సెల్లింగ్ పాయింట్‌గా మార్చాలని తాను అనుకున్నట్లు పేర్కొన్నాడు.
తక్కువ స్థలంలో కూడా హాయిగా నివసించగల హోటల్స్ కట్టగలమని నిరూపించాలని తాను భావించినట్లు పేర్కొన్నాడు.
పిటూరూమ్స్ డిసెంబర్ 2022లో లాంచ్ అయింది.ఇప్పటివరకు దేశీయ అతిథులను ఎక్కువగా ఆకర్షించింది.
ఆరి ఇంద్ర మాట్లాడుతూ, అతిథులు హోటల్, అది అందించే అనుభవాన్ని చూసి ఆశ్చర్యపోయారని చెప్పారు.
భార్యను ప్రియుడికిచ్చి వివాహం చేసిన భర్త.. ట్విస్ట్ ఏమిటంటే?