Stag Beetle : ఈ పురుగు విలువ అక్షరాలా కోటి రూపాయలు.. దీని ప్రత్యేకతలు ఇవే

ఈ ప్రపంచంలో ఎన్నో అరుదైన జంతువులు, పక్షులు, కీటకాలు ఉన్నాయి.సాధారణంగా కొన్ని రకాల కీటకాలను( Insects ) చూసినప్పుడు చాలా మంది భయపడతారు.

కొన్ని పురుగులు కుడితే మన ప్రాణాలకు ప్రమాదం కావడంతో అలాంటి వాటిని చూడగానే చాలా మంది పారిపోతారు.

ముఖ్యంగా కందిరీగలు, తేనెటీగలు వంటివి కుట్టినప్పుడు మనకు తీవ్రమైన నొప్పి కలుగుతుంది.వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందుతాం.

అయితే ఓ రకమైన పురుగు కనిపించినప్పుడు మాత్రం మీరు అస్సలు కంగారు పడొద్దు.

ఆ పురుగు మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

ఒక పురుగు మిమ్మల్ని ఎలా కోటీశ్వరులను చేస్తుందో అనుకుంటున్నారా? కానీ ఇది తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఈ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, అరుదైన కీటకం గురించి తెలుసుకుందాం. """/"/ ఈ భూమి మీద స్టాగ్ బీటిల్( Stag Beetle ) అనే కీటకం ఉంది.

ఈ కీటకం దాని ఖరీదైన ధర కారణంగా మాత్రమే దాని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి.

స్టాగ్ బీటిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం.ఇది కేవలం 2 నుండి 3 అంగుళాల పరిమాణంలో ఉన్నప్పటికీ, ఈ కీటకం ధర రూ.

కోటి కంటే ఎక్కువగా( Expensive Insect ) ఉంటుంది.ఈ అరుదైన కీటకాన్ని కొనుగోలు చేసేందుకు చాలా దేశాలు కోట్లాది రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమయ్యాయి.

ఆసక్తికరంగా, స్టాగ్ బీటిల్ అరుదైన జాతి మాత్రమే కాదు.భూమిపై అతి చిన్న మరియు వింతైన కీటకాలలో ఒకటి.

నేషనల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం, స్టాగ్ బీటిల్స్ తీపి ద్రవాలను తింటాయి.చెట్ల నుండి వచ్చే రసాన్ని, కుళ్ళిన పండ్ల నుండి వచ్చే ద్రవాలను తాగుతాయి.

మగ స్టాగ్ బీటిల్స్ పెద్ద దవడలను కలిగి ఉంటాయి.ఆడవి మగ వాటి కంటే బలమైన దవడలను కలిగి ఉంటాయి.

ఆడ స్టాగ్ బీటిల్స్( Female Stag Beetle ) తరచుగా నేలపై కనిపిస్తాయి.

"""/"/ గుడ్లు పెట్టడానికి ఎప్పుడూ చోటు కోసం వెతుకుతూనే ఉంటాయి.ఈ కీటకం నయం చేయలేని వ్యాధులకు మందుల తయారీలో ఉపయోగించబడుతుంది.

కాబట్టి, దీని ధర చాలా ఎక్కువగా ఉంది.అయినప్పటికీ ఈ జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది.

కీటకాల పరిమాణం చాలా చిన్నది కాబట్టి అవి సాధారణంగా కనిపించవు.అయితే ప్రపంచవ్యాప్తంగా వీటికి చాలా డిమాండ్‌ ఉంది.

గతంలో భారత కరెన్సీలో రూ.65 లక్షల ధర ఈ స్టాగ్ బీటిల్‌కు పలికింది.

అయితే ప్రస్తుతం అంతకంటే ఎక్కువ ధర దీనికి ఉంది.కొన్ని కంపెనీలు అయితే ఈ స్టాగ్ బీటిల్‌కు రూ.

కోటి ధర అయినా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి.

వయసు పెరిగిన బన్నీలో మార్పు రాలేదు.. వరుణ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు!