ఈ ఐస్‌క్రీమ్‌ బంగారం కంటే ఖరీదైనదంటే మీరు నమ్ముతారా?

ఐస్‌క్రీమ్‌.( Ice Cream ) ఇక్కడ ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి.

పైగా వేసవి.ఈ వేసవిలో చల్ల చల్లని ఐస్‌క్రీమ్‌ తింటే ఆ మజా ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం.

దీనిని చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటూ వుంటారు.కాబట్టి ముఖ్యంగా ఈ సమ్మర్లో వీటి సేల్స్ అనేవి దారుణంగా ఉంటాయి.

అయితే మీరు ఐస్‌క్రీమ్‌ కోసం ఎంతడబ్బు వెచ్చి వుంటారు.ఓ వంద రూపాయిల నుండి మహాకాకపోతే 500 వరకు వెచ్చించి వుంటారు.

అది కూడా ఓ ఫామిలీ మొత్తం ఆ ఖరీదుతో ఐస్‌క్రీమ్‌ తినొచ్చు. """/" / అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ గురించి మీరు ఎపుడైనా విన్నారా? దీని ధర వెయ్యో, పదివేలో కాదండీ.

అక్షరాలా రూ.5 లక్షల కంటే ఎక్కువే.

అవును, జపాన్‌కు ( Japan ) చెందిన ఐస్‌క్రీమ్‌ తయారీదారులలో ఒకటైన 'సిలాటో'( Cellato ) దీనిని తయారు చేసింది.

ఇది బైకుయా అనే ప్రోటీన్ కలిగిన ఐస్‌క్రీమ్‌ కావడంతో దీనికి అంత ధర అని దానిని తయారుచేసినవారు చెబుతున్నారు.

"""/" / కాగా, ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన 'ఐస్‌క్రీమ్‌'గా రికార్డులకెక్కడం విశేషం.

ఇంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ కూడా పాలతోనే తయారవడం కొసమెరుపు.ఇందులో చీజ్, గుడ్డులోని పచ్చ సోన వంటివి కలుపుతారని సమాచారం.

వీటితో పాటు ఇందులో పర్మిజియానో చీజ్, ట్రఫుల్ ఆయిల్, వైట్ ట్రఫుల్, గోల్డ్ లీఫ్‌ ఉంటాయి.

ఇది చూడటానికి సాధారణ ఐస్ క్రీమ్ మాదిరిగానే కనిపించినప్పటికీ టేస్ట్ మాత్రం అమోఘం అని అంటున్నారు.

అయితే దీనిని తినటానికి ఉపయోగించే స్పూన్ చేతితో తయారు చేసిన మెటల్ కావడం విశేషం.

దీనిని క్యోటోకి చెందిన హస్తకళాకారులు ప్రత్యేకంగా తయారు చేశారు.

వైరల్ వీడియో: టేకాఫ్ అవుతుండగా విమానంలో చెలరేగిన మంటలు.. చివరకి?