ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హార్ట్ డే .

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పనిచేస్తున్నఆరోగ్య సిబ్బందికి హెల్త్ చెకప్ చేశారు .కార్యక్రమంలో భాగంగా 35 మంది సిబ్బందికి డాక్టర్ లు,పారా మెడికల్ సిబ్బంది, ఔట్సోర్సింగ్ సిబ్బంది,108 సిబ్బంది ప్రతి ఆరోగ్య సిబ్బందిని బిపి, షుగర్, మరేమైనా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వ్యాదుల పరీక్షలునిర్వహించారు.

రోగులందరికిమందులు పంపిణీ చేశారు.వరల్డ్ హార్డ్ డే ఈ సంవత్సరం వీలైనంతమంది తెలుసుకోవాల్సి అవసరం ఉన్నదనీ డాక్టర్లు తెలిపారు.

ప్రజలు ప్రతిరోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాలని పోషక విలువలు కలిగిన ఆహారం బుజించాలని, బరువుని అదుపులో ఉంచుకోవాలని పొగ త్రాగడం మానీ వేయాలని, ఆల్కహాల్ తగ్గింంచాలని అధిక ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా, క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్ను, బిపి, షుగర్ పరీక్షలు చేపించుకొని డాక్టర్ లను సంప్రదించాలని వ్వైద్యులు కోరారు.

దొడ్డిదారిన అగ్రరాజ్యంలోకి .. భారతీయులను తిప్పి పంపుతోన్న అమెరికా, ఎంత మందో తెలుసా..?