ప్రపంచానికి తెలిసిన తెలంగాణ పండుగ.. బూర్జు ఖలీఫాపై బతుకమ్మ..

తెలంగాణలో మహిళలకు అతి పెద్ద పండుగ బతుకమ్మ.ఇది కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే చెందిన పండుగ.

ఇంతకాలం రాష్ట్రానికి, దేశానికే పరిమితమైన ఈ పండుగ.కొద్ది గంటల క్రితం ప్రపంచం మొత్తానికి తెలిసింది.

ప్రపంచం దృష్టి మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది.ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఈ నెల 23న దుబాయ్ లోని బుర్జ్‌ఖలిఫాపై బతుకమ్మ పండుగకు సంబంధించిన వీడియో ప్రదర్శించారు.

పండుగ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి చాటిచెప్పారు.బుర్జ్ ఖలిఫా ప్రపంచంలోనే అతి పెద్దదైన భవనం.

ప్రపంచంలోనే అతి పెద్దదైన స్కీన్ సైతం ఇదే.దీనిపై బతుకమ్మ పండుగ వీడియోను రెండు సార్లు ప్రదర్శించారు.

ఈ వీడియోలో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.జై తెలంగాణ అంటూ స్క్రీన్ పై రావడంతో ప్రవాస తెలంగాణ వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ప్రపంచం మొత్తానికి తెలంగాణ పేరు తెలిసిందని కేరింతలు వేశారు.ఇందులో మధ్యలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని సైతం ప్రదర్శించారు.

ఇక ఈ వీడియో గురించి ఎమ్మె్ల్సీ కవిత మాట్లాడుతూ బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించడం రాష్ట్రానికే కాదు.

దేశానికే గర్వకారణమని తెలిపారు.ఇందుకు సపోర్ట్ చేసిన యూఏఈ గవర్నమెంట్‌కు, బుర్జ్ ఖలీఫా నిర్వహకులకు ఎమ్మెల్సీ ధన్యవాదాలు తెలిపారు.

"""/"/ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి.పెద్ద ఎత్తున పండుగను నిర్వహించి ప్రజలను ఉద్యమంలో భాగస్వాములుగా చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లోనూ ప్రవాస తెలంగాణ‌వాసులు ఈ పండుగను జరుపుకుంటున్నారు.

ఈ సంవత్సరం బతుకమ్మకు సంబంధించిన ఆస్కార్ అవార్డు పొందిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్.

రెహమాన్, డైరెక్టర్ గౌతమ్‌మీనన్ కాంబినేషన్‌లో ఓ స్పెషల్‌గా సాంగ్‌ను రూపొందించారు.ఈ పాట అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

ప్రస్తుతం చాలా మంది నోట ఆ పాట వినబడుతోంది.

రాజంపేట బహిరంగ సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!