వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఎంతో తెలుసా?

విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో రాశిఖన్నా, ఇజబెల్లా, కేథరిన్‌ తెర్సా, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్స్‌గా నటించారు.

ప్రస్తుతం సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సినిమా మొదటి రోజుకు రికార్డు స్థాయిలో బుకింగ్స్‌ నమోదు అయిన విషయం తెల్సిందే.

"""/"/వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం షూటింగ్‌ సమయంలో పెద్దగా క్రేజ్‌ లేకున్నా విడుదల సమయానికి బాగా పాపుర్‌ అయ్యింది.

దాంతో అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం దాదాపుగా 30 కోట్ల బిజినెస్‌ చేసినట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

విజయ్‌ గత చిత్రాతో పోల్చితే ఇది భారీ మొత్తమే అని చెప్పుకోవాలి. """/"/ఇక ఏరియాల వారిగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు చూస్తే నైజాం ఏరియాలో రౌడీకి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఏకంగా 10 కోట్లకు అమ్ముడు పోయింది.

ఇక సీడెడ్‌ లో 4 కోట్లు, ఆంధ్రా 10 కోట్లకు అమ్ముడు పోయింది.

ఇక ఓవర్సీస్‌ మరియు ఇతర ఏరియాల్లో మరో ఆరు కోట్ల వరకు ఈ చిత్రం తెచ్చింది.

సినిమాను పాతిక కోట్లతో తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.థియేట్రికల్‌ రైట్స్‌తోనే 30 కోట్లు రాబట్టగా ఇతర రైట్స్‌ ద్వారా మరో 10 కోట్లు రాబట్టింది.

సినిమాకు 15 కోట్ల టేబుల్‌ ప్రాఫిట్‌.సినిమాకు ఏమాత్రం సక్సెస్‌ టాక్‌ వచ్చిన అయిదు కోట్ల వరకు లాభం వచ్చే అవకాశం ఉంది.

ఇక సూపర్‌ హిట్‌ అయితే ఆ లెక్క మరింత పెరగడం ఖాయం అంటున్నారు.