ప్రపంచ తల్లి పాల వారోత్సవం: ఆగస్టు 1 నుండి 7, 2024

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈ సంవత్సరం ప్రపంచ తల్లి పాల వారోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

ఈ సంవత్సరపు థీమ్: *"అంతరాలను తొలగించి తల్లిపాల ప్రాముఖ్యతను చాటుదాం"* (రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ప్రసూతి ఆస్పత్రులలో ప్రసవించే తల్లులకు సహకరించి తల్లిపాల ప్రాముఖ్యతను ప్రోత్సహిద్దాం).

ఈ సందర్భంగా మాతృ పాల యొక్క ప్రాముఖ్యతను, లాభాలను, మరియు ప్రతి స్త్రీకి ప్రసవం సమయంలో మద్దతు అవసరమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం.

ప్రపంచ తల్లి పాల వారోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు నిర్వహించబడుతుంది.

ఈ సంవత్సరం థీమ్ "అంతరాలను తొలగించి తల్లిపాల ప్రాముఖ్యతను చాటుదాం" అని నిర్ణయించబడింది.

తల్లిపాల వారోత్సవాల లక్ష్యాలు: - ఆరోగ్య సదుపాయాలతో తల్లిపాలను ఇవ్వడంలో మద్దతు గురించి ఉన్న అంతరాలను ఆటంకాలను తెలియజేయడం.

- ఈ అంతరాలను/ ఆటంకాలను నివారించడానికి సాధనాలు, వనరులను పంచుకోవడం.- తల్లులు మరియు శిశువులలో తల్లిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం మరియు ఆరోగ్య నిపుణులతో చర్చించడం.

- చర్చించిన ఆలోచనలను నమోదు చేయడం మరియు వాటిని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లు, హెల్త్ కేర్ ప్రొవైడర్లు, విధాన రూపకర్తలతో పంచుకోవడం.

కార్యక్రమాలు: - జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో వివిధ కార్యక్రమాలను చేయడం.- ఐసిడిఎస్ సెక్టార్ సమావేశాలు నిర్వహించడం.

- ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించే మహిళలందరికీ తల్లిపాలను ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలను తెలియజేయడం, ఇబ్బందులను, అంతరాలను నివారించడం.

- ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్ల ఉమ్మడి గృహ సందర్శన నిర్వహించడం.- గ్రామస్థాయిలో VHSND కార్యక్రమాలను నిర్వహించడం.

- పాలిచ్చే తల్లులకు కౌన్సిలింగ్ చేయడం.- హాస్పిటల్ సందర్శనలు చేయడం.

- మూడవ త్రైమాసికంలో ఉన్న గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు అవగాహన కల్పించడం.- గ్రామస్థాయిలో అన్నప్రాసన పై సి బి ఈ లను నిర్వహించడం.

- గృహ సందర్శనలు చేయడం.- స్వయం సహాయక బృందాలతో సమావేశాలు నిర్వహించడం.

ఇట్టి కార్యక్రమాలలో పుట్టిన వెంటనే పాపకు ముర్రుపాలను అందించడం, వాటి ప్రాముఖ్యతను తెలియజేయడం, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించేలా చూడడం, రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను కొనసాగించడం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?