వర్క్ ఫ్రొం హోమ్ ఉద్యోగులకు మరికాస్త ఊరట ఇవ్వబోతున్న కంపెనీలు..!

కరోనా వల్ల ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది.చాలా మంది కరోనా సోకి తమ ప్రాణాలను పోగోట్టుకున్నారు.

ఇంకొందరు ఆక్సిజన్ అందక ప్రాణాలను విడిచారు.లాక్ డౌన్ లో తగిన స్తోమత లేకపోవడం వలన ఆకలి చావులు ఎన్నో జరిగాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.కరోనా కేసులు తగ్గడం వలన ఆర్థిక రంగం పుంజుకుంటోంది.

చాలా సంస్థలు కరోనా అటాక్ అవ్వకుండా ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటును తమ ఉద్యోగులకు కల్పించారు.

దీంతో అనేక మంది ఉద్యోగులు తమ ఇంటి నుంచే పనులు చేసుకుంటూ ఉన్నారు.

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడం వలన ఇక ఆఫీసులు ఒక్కోక్కటీ తెరుచుకుంటున్నాయి.తమ ఉద్యోగులను కూడా ఆఫీసులకు రావాలంటూ కొన్ని సంస్థలు సూచనలు చేస్తున్నాయి.

సెప్టెంబర్ నెలలో మొదటి వారం నుంచి ఆఫీస్ కు రావాలని కొన్ని కంపెనీలు తెలిపాయి.

ఇకపోతే ఇప్పుడున్న స్థితిలో ఇంకొంత కాలం పాటు ఇంటి నుంచే పనులు చేయించాలని ఇంకొన్ని కంపెనీలు అనుకుంటున్నాయి.

"""/"/ సెప్టెంబర్ మొదటి వారం నుంచి 3 రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీసు బేస్ మీద పనిచేయాలని ఉద్యోగులకు చాలా కంపెనీలు ఆదేశాలు ఇచ్చాయి.

ఇప్పుడు తాజాగా వర్క్ ఫ్రం హోమ్ ను మరో నెలకు పైనే పెట్టాలని అనుకుంటున్నాయి.

గూగుల్, ఫేస్ బుక్, యాపిల్ తో పాటు ఇంకొన్ని ఎంఎన్సీ కంపెనీలు తమ ఉద్యోగులకు కొన్ని సూచనలు చేస్తూ ఆదేశాలు ఇచ్చాయి.

వ్యాక్సిన్లు వేయించుకున్నవారే ఆఫీసులకు రావాలని ఖరాఖండీగా తేల్చి చెప్పేశాయి.కచ్చితంగా ఒక్క డోస్ వ్యాక్సిన్ వేసుకున్నవారు మాత్రమే ఆఫీసులకు రావాలని తేల్చి చెప్పాయి.

ఇకపోతే అక్టోబర్ 18వ తేది వరకు ఉద్యోగులు ఇంటిలోనే పని చేసుకోవచ్చని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలియజేశారు.

గూగుల్ నుంచి అటువంటి అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే యాపిల్, ఫేస్ బుక్ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఇటువంటి ఆదేశాలే ఇచ్చాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గడువును మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉంది.

మరోసారి సీనియర్ కొరియోగ్రాఫర్లకే అవకాశం ఇస్తున్న చిరంజీవి…