వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులపై అదనపు ట్యాక్స్

ఉద్యోగాలు ఉంటాయో.ఊడుతాయో తెలియని పరిస్థితి.

కరోనా విజృంభణ కారణంగా అన్ని వ్యాపార సంస్థలు లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెలిసిందే.

ఈ లాక్ డౌన్ లో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలిగిస్తే కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించారు.

కరోనా దెబ్బకు ఉన్న సంస్థలు జీతాల్లో కోతలు విధిస్తున్నారు.చాలిచాలని జీతాలతో ఉద్యోగులు జీవితాన్ని సాగదీస్తున్నారు.

వర్క్ ఫ్రమ్ హోం కారణంగా కావాల్సిన సౌకర్యాలు సమకూర్చుకోవడం లేదు.అయితే తాజాగా అదనపు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ వార్త వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగస్థుల్లో గుబులు పుట్టిస్తోంది.ఎలా అంటారా.

అయితే ఉద్యోగుల వేతన ప్యాకేజీలోని పలు అలవెన్సులు ఉంటాయి.ఎక్స్పెన్సెస్ కన్వెయన్స్, ఫ్యూయెల్ రీయింబర్స్ మంట్ వంటి వాటిపై అదనపు పన్ను భారం పడనుంది.

కోవిడ్-19 కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో స్థానిక సంస్థలు ట్రావెల్ అలవెన్సులపై నిషేధం విధించింది.

ఈ అలవెన్సులపై పన్ను ప్రయోజనాలు, ఖర్చులు జరిగినప్పుడే వర్తిస్తాయి.లేదంటే అవన్నీ పన్ను పరిధిలోకి వస్తాయని ట్యాక్స్ నిపుణులు పేర్కొన్నారు.

ట్యాక్స్ పెరుగుదలకు ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు నిపుణులు.ఈ అదనపు ట్యాక్స్ భారం రూ.

5లక్షలలోపు శాలరీ ప్యాకేజీ ఉన్న ఉద్యోగులపై ఎక్కు ప్రభావం చూపుతుందన్నారు.అలవెన్సులు ట్యాక్స్ పరిధిలోకి రావడంతో ట్యాక్సబుల్ ఇన్ కమ్ రూ.

5 లక్షల లిమిట్ దాటడంతో అలా అదనపు ట్యాక్స్ వారిపై పడుతుందన్నారు.పన్ను చెల్లింపుదారులకు ఎల్ టీఏ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ సమయం ఉందని, సకాలంలో పన్నులు చెల్లింపులు అదనపు భారం నుంచి విముక్తి పొందండని నిపుణులు వెల్లడించారు.

నాన్నను అలా చూడటం నాకు ఇప్పటికీ గుర్తుంది.. మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ వైరల్!