పల్చటి జుట్టుతో బెంగెందుకు.. ఇలా చేస్తే వారం రోజుల్లో ఒత్తుగా మారుతుంది!

పల్చటి జుట్టు.చాలా మందిని కలవరపెట్టే సమస్య ఇది.

హెయిర్ ఫాల్ అనేది అందరిలోనూ ఉంటుంది.కానీ కొందరిలో జుట్టు ఊడుతుంది.

కానీ కొత్త జుట్టు రాదు.దీంతో ఒత్తైన కురులు కొద్దిరోజుల్లోనే పల్చగా మారిపోతాయి.

మీరు కూడా పల్చటి జుట్టుతో బెంగ పెట్టుకున్నారా.? ఎంత ప్రయత్నించినా జుట్టు మళ్ళీ ఒత్తుగా రావడం లేదా.

? డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని పాటిస్తే మీ జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే నెల రోజుల్లో ఒత్తుగా మారుతుంది.

మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek ) రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ లవంగాలు ( Cloves )వేసి స్లైట్ గా వేయించుకోవాలి.

ఇలా వేయించుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి.

"""/" / వాటర్ హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడితో పాటు వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె ( Coconut Oil )వేసి ఉడికించాలి.

పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloe Vera Gel ) హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేస్తే మంచి సీరం సిద్ధమవుతుంది.

నైట్ నిద్రించే ముందు ఈ సీరం ను స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని కాసేపు మసాజ్ చేసుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్‌ షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే మీ జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.

ఈ సీరం హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేయడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

కాబట్టి పల్చటి జుట్టుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సీరంను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.