పాదాలు పగిలి నొప్పి పుడుతున్నాయా? అయితే వెంటనే ఇలా చేయండి!

పాదాల పగుళ్లు.( Cracked Feet ) స్త్రీ పురుషుడు అనే తేడా లేకుండా చాలా మందిని అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.

పాదాల పగుళ్లు ఏర్పడడానికి కారణాలు అనేకం.ఊబ‌కాయం, పాదాల‌ను స‌రిగ్గా క్లీన్ చేయకపోవడం, శ‌రీరంలో అధిక వేడి, గంటల తరబడి నిలబడి ఉండటం, వాతావరణంలో వచ్చే మార్పులు తదితర కారణాల వల్ల పాదాల పగుళ్ల సమస్య ఏర్పడుతుంది.

అయితే కార‌ణం ఏదైనా పాదాలు పగలడం వల్ల తీవ్రమైన నొప్పికి అసౌకర్యానికి గురవుతుంటారు.

ఒక్కోసారి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.అడుగు తీసి అడుగు వేయడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు.

ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.

వెంటనే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటించండి.ఈ రెమెడీ పాదాల పగుళ్లను చాలా వేగంగా మరియు సులభంగా తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

"""/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్ ను( Vaseline ) వేసుకోవాలి.

అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గోరువెచ్చని ఆవ నూనె, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, ( Aloe Vera Gel ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మరియు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

"""/" / ప్ర‌తిరోజు ఈ వండర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే వాసెలిన్, అలోవెరా జెల్, ఆవనూనె మరియు నిమ్మరసంలో ఉండే పలు సుగుణాలు పాదాల పగుళ్లను చాలా వేగంగా మాయం చేస్తాయి.

అదే సమయంలో పాదాలను సున్నితంగా మరియు కోమలంగా మారుస్తాయి.కాబట్టి ఎవరైతే పాదాల పగుళ్ల సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో తప్పకుండా వారు ఈ హోమ్ మేడ్ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

వర్సిటీ క్యాంపస్‌లో లోదుస్తులతో విద్యార్థిని నిరసన.. మ్యాటరేంటంటే?