మీ హెయిర్ చాలా షార్ట్ గా ఉందా.. ఈ రెమెడీని పాటిస్తే రెండు నెలల్లో పొడుగ్గా మారుతుంది?
TeluguStop.com
సాధారణంగా కొందరి జుట్టు( Hair ) చాలా షార్ట్ గా ఉంటుంది.ఇలాంటి వారు జుట్టును పొడుగ్గా మార్చుకునేందుకు తెగ ఆరాటపడుతూ ఉంటారు.
జుట్టుకు ఖరీదైన ఆయిల్స్ వాడుతుంటారు.ఇరుగుపొరుగు వారు చెప్పిన చిట్కాలు అన్ని పాటిస్తుంటారు.
అయినా సరే జుట్టు ఎదుగుదలలో ఎలాంటి మార్పు కనిపించకపోతే ఎంతో బాధపడతారు.కానీ వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక పాటిస్తే కేవలం రెండు నెలల్లో షార్ట్ గా ఉన్న మీ జుట్టు పొడుగ్గా మారుతుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. """/"/
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ), వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ ఆకులు, ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులు, రోజ్ మేరీ ఆకులను వాటర్ తో సహా వేసుకోవాలి.
అలాగే రెండు మందారం పువ్వులు, రెండు మందారం ఆకులు( Hibiscus ), అర కప్పు వాటర్ వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే జుట్టు ఎదుగుదల అద్భుతంగా పెరుగుతుంది.
"""/"/
ఈ వండర్ ఫుల్ హోమ్ రెమెడీ( Home Remedy )తో మీ జుట్టు ఎంత షార్ట్ గా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే పొడుగ్గా మారుతుంది.
లాంగ్ హెయిర్ కావాలని కోరుకునే వారికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
అలాగే వారానికి రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు సిల్కీగా షైనీ గా సైతం మెరుస్తుంది.
ఫ్యామిలీ మీల్‌పై మూత్రం పోసిన కొడుకు.. ఎంకరేజ్ చేసిన తల్లి..?