Walnut Milk : వాల్‌నట్ మిల్క్ తో వండర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్.. అవేంటో తెలిస్తే తాగకుండా ఉండలేరు!
TeluguStop.com

ఇటీవల కాలంలో చాలా మంది డైరీ మిల్క్ ను దూరం పెడుతున్నారు.డైరీ మిల్క్( Diary Milk ) కు ప్రత్యామ్నాయాలు ఎంచుకుంటున్నారు.


మీరు ఈ జాబితాలో ఉన్నట్లయితే నిస్సందేహంగా వాల్ నట్ మిల్క్ ను ఎంచుకోవచ్చు.


వాల్‌నట్ మిల్క్ నిజమైన పోషక శక్తిగా నిలుస్తాయి.చక్కటి రుచిని కలిగి ఉండడమే కాకుండా వండర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తాయి.
ఆ బెనిఫిట్స్ ఏంటో తెలిస్తే వాల్‌నట్ మిల్క్ ను తాగకుండా ఉండలేరు.వాల్ నట్స్ తో ఇంట్లోనే చాలా సులభంగా మిల్క్ ను తయారు చేసుకోవచ్చు.
వాల్ నట్ మిల్క్ ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ తో లోడ్ చేయబడతాయి.
అందువల్ల ఇవి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. """/"/ చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తాయి.
వాల్ నట్ మిల్క్( Walnut Milk ) లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ మిల్క్ ను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
అలాగే వాల్ నట్ మిల్క్ బ్రెయిన్ బూస్టర్( Brain Booster ) గా పనిచేస్తాయి.
ఈ పాలలో ఉండే పోషకాలు మరియు హెల్తీ ఫ్యాట్స్ మెరుగైన జ్ఞాపకశక్తి, దృష్టి మరియు అభిజ్ఞా సామర్థ్యాలను ప్రోత్సహిస్తాయి.
వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి వాల్‌నట్ మిల్క్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
ఆహారంలో వాల్‌నట్ మిల్క్‌ని చేర్చుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.
మెటబాలిజం రేటు( Metabolism Rate ) కూడా పెరుగుతుంది.ఫలితంగా కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.
"""/"/
వాల్‌నట్ మిల్క్ లో లాక్టోస్( Lactose ) ఉండదు.డైరీ మిల్క్ అలర్జీ ఉన్నవారి వాల్‌నట్ మిల్క్ ఉత్తమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
అంతేకాకుండా వాల్‌నట్ మిల్క్ లో విటమిన్ ఈ, మెగ్నీషియం మరియు ఫాస్పరస్‌తో సహా అనేక విటమిన్లు, మినరల్స్ నిండి ఉంటాయి.
వాల్ నట్ మిల్క్ ను డైట్ లో చేర్చుకుంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి.కండరాల బలహీనత తలెత్తకుండా ఉంటుంది.
మరియు చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా మెరుస్తుంది.వృద్ధాప్య ఛాయలు ద్వారా దరిచేరకుండా సైతం ఉంటాయి.
రజినీకాంత్ వరుస సినిమాలతో సక్సెస్ కొడుతున్నాడా..?