ఉగాది పచ్చడితో ఊహించ‌ని ఆరోగ్య లాభాలు..అస్స‌లు మిస్ అవ్వొద్దు!

నేడు ఉగాది పండుగ అన్న సంగ‌తి తెలిసిందే.తెలుగు వారికి ఉగాదితోనే కొత్త సంవ‌త్స‌రం ప్రారంభం అవుతుంది.

అందుకే ఈ పండుగ‌ను ఎంతో ఆనందంగా సెల‌బ్రేట్ చేసుకుంటారు.ఇక ఉగాది అంటే అంద‌రికీ మొద‌ట గుర్తుకు వ‌చ్చేది ఉగాది ప‌చ్చ‌డి.

ఈ పచ్చడి షడ్రుచుల సమ్మేళనం.తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు.

మొత్తం ఆరు రుచుల క‌ల‌యిక‌తో ఈ ఉగాది ప‌చ్చ‌డిని త‌యారు చేస్తారు.జీవితం కూడా ఉగాది పచ్చడి మాదిరిగానే అన్నింటి కలబోతగా ఉంటుంది.

మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఈ ప‌చ్చ‌డి సూచిస్తుంది.

ఆరోగ్య ప‌రంగానూ ఉగాది ప‌చ్చ‌డి ఊహించ‌ని లాభాల‌ను చేకూరుస్తుంది.అవును, ఖాళీ క‌డుపుతో ఉగాది ప‌చ్చ‌డిని తిన‌డం వ‌ల్ల జీర్ణాశయంలో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌న్నీ బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

జీర్ణ‌వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం, ఛాతిలో మంట‌ వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

"""/"/ అలాగే ఉగాది ప‌చ్చ‌డిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో మ‌లినాల‌న్నీ తొల‌గిపోయి ర‌క్తం శుద్ధి అవుతుంది.

కడుపులో నులి పురుగులు ఉన్నా చ‌చ్చిపోతాయి.వెయిట్ లాస్‌కు కూడా ఉగాది ప‌చ్చ‌డి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ప‌ర‌గ‌డుపున ఉగాది ప‌చ్చ‌డిని తీసుకుంటే శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వు కురుగుతుంది.ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.

అంతే కాదు, ఉగాది ప‌చ్చ‌డిని తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.

వివిధ ర‌కాల వైర‌స్‌లు, ఇన్ఫెక్ష‌న్లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

వాత, పిత్త దోషాలు పెరగకుండా ఉంటాయి.శ‌రీరం యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా మారుతుంది.

సో.ఆరోగ్యానికి ఇన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందించే ఉగాది ప‌చ్చ‌డిని అస్స‌లు మిస్ అవ్వ‌ద్దు.

ఉగాది పండ‌గ నాడే కాదు అప్పుడ‌ప్పుడు కూడా ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

అర్హ పుట్టినరోజు.. వైరల్ అవుతున్న స్టార్ హీరో అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!