అధిక ఒత్తిడి వేధిస్తుందా? అయితే ఈ `టీ`మీరు తాగాల్సిందే!
TeluguStop.com
అధిక ఒత్తిడి.నేటి టెక్నాలిజీ కాలంలో ఎందరో కామన్‌గా ఎదర్కొంటున్న సమస్య ఇది.
ఒత్తిడికి కారణం ఏదైనప్పటికీ.దానిని అదుపులో ఉంచుకోకుంటే మాత్రం మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అందుకే ఆరోగ్యానికి నిపుణులు సైతం ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచిస్తుంటారు.అయితే అధిక ఒత్తిడిని తగ్గించడంలో `త్రిఫల టీ` అద్భుతంగా సహాయపడుతుంది.
ఉసిరి, కరక్కాయ, తానికాయలతో తయారు చేసిందే త్రిఫల లేదా త్రిఫల చూర్ణం అంటారు.
ఈ త్రిఫల చూర్ణం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో జబ్బులను నివారిస్తుంది.
ముఖ్యంగా దీనితో టీ తయారు చేసుకుని తీసుకుంటే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.
మరి లేట్ చేయకుండా త్రిఫల టీ ని ఎలా తయారు చేయాలి.? అసలు త్రిఫల టీ తాగడం వల్ల వచ్చే ఆరోగ్య లాభాలు ఏంటీ.
? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు వాటర్ వేసి లైట్‌గా హిట్ చేయండి.
ఇప్పుడు అందులో ఒక స్పూన్ త్రిఫల పొడిని వేసి బాగా మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా తేనెను కలుపుకుంటే సరిపోతుంది.ఈ త్రిఫల టీని రోజూ ఉదయాన్నే తీసుకుంటే.
అందులో ఉండే కొన్ని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడి, తలనొప్పి, ఆందోళన వంటి సమస్యలు దూరం చేసి మనసును ప్రశాంతంగా మారుస్తాయి.
"""/"/
అలాగే రెగ్యులర్‌గా త్రిఫల టీని సేవించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
దాంతో తరచూ జబ్బుల బారిన పడకుండా ఉంటాయి.బరువు తగ్గాలనుకునే వారికి కూడా త్రిఫల టీ గ్రేట్‌గా సహాయపడుతుంది.
ప్రతి రోజూ ఉదయాన్నే త్రిఫల టీని తీసుకుంటే శరీరంలో కొవ్వు క్రమంగా కరుగుతుంది.
అంతేకాదు, త్రిఫల టీని తాగడం వల్ల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.
శరీరంలో వ్యర్థాలు, విషాలు బయటకు వెళ్లిపోతాయి.మలబద్ధకం సమస్య తగ్గు ముఖం పడుతుంది.
మరియు చర్మంపై మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి.
మా నాన్న రైతు.. నేను కూడా రైతుబిడ్డనే.. గీతూ రాయల్ కామెంట్స్ వైరల్!