ఆరోగ్యానికి అండగా దాల్చిన చెక్క.. నిత్యం చిటికెడు పొడిని తీసుకుంటే ఎన్ని లాభాలో!

దాల్చిన చెక్క.( Cinnamon ) సాధారణంగా చాలా మందికి బిర్యానీ, పులావ్ చేసినప్పుడే ఇది గుర్తుకు వస్తుంది.

ఎందుకంటే ఆయా వంటలకు దాల్చిన చెక్క చక్కని రుచి, ఫ్లేవర్ ను అందిస్తుంది.

కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దాల్చిన చెక్కలో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.నిత్యం చిటికెడు దాల్చిన చెక్క పొడిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

</br.రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవచ్చు.

ఒక గ్లాస్ వాటర్ లో పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి మరియు చిటికెడు యాలకుల పొడి మిక్స్ చేసి తీసుకోవచ్చు.

అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె లో పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని మిక్స్ చేసి తీసుకోవచ్చు.

ఇక ఒక గ్లాసు వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించి కూడా తీసుకోవ‌చ్చు.

</br. """/" / ఇలా ఎలా తీసుకున్న ఆరోగ్యానికి మంచిదే.

దాల్చిన చెక్క చెడు కొలెస్ట్రాల్ ( Bad Cholesterol )ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మధుమేహం లో హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది.మోకాళ్ళ నొప్పులను నివారించి ఎముకల్లో పటుత్వాన్ని పెంచుతుంది.

నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుంది.సుఖమైన, ప్రశాంతమైన నిద్ర ను అందిస్తుంది.

</br. """/" / నెలసరి నొప్పుల( Menstrual Pains )కు సైతం దాల్చిన చెక్క ఒక విరుగుడుగా పనిచేస్తుంది.

అలాగే దాల్చిన చెక్కను నిత్యం తీసుకుంటే హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

అల్జీమర్స్( Alzheimer ) వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు పలు రకాల క్యాన్సర్లు సైతం దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

సో.ఇన్ని ప్రయోజనాలు అందించే దాల్చిన చెక్కను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.

పల్చటి జుట్టుకు పుదీనాతో చెక్ పెట్టవచ్చు.. ఎలాగంటే?