అనాస పువ్వుతో అంతులేని ప్ర‌యోజనాలు..అస్స‌లు మిస్ అవ్వ‌కండి!

అనాస పువ్వు.అద్భుత‌మైన మ‌సాలా దినుసుల్లో ఇది ఒక‌టి.

దీనిని స్టార్‌ అనీస్ అని పిలుస్తుంటారు.చూసేందుకు న‌క్ష‌త్రంలా క‌నిపించే అనాస పువ్వు వంటల‌కు చ‌క్క‌టి ఫ్లేవ‌ర్‌ను అందిస్తుంది.

అందుకే బిర్యానీ, పులావ్ మరియు మ‌సాలా కూర‌ల్లో అనాస పువ్వును త‌ప్ప‌కుండా వేస్తుంటారు.

అలాగే దీనిలో బోలెడ‌న్ని పోష‌కాలు, మ‌రెన్నో ఔష‌ధ గుణాలు కూడా పుష్క‌లంగా నిండి ఉంటాయి.

అందు వ‌ల్ల‌నే అనాస పువ్వుతో అంతులేని ప్ర‌యోజనాలను పొందొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అనాస పువ్వును తీసుకుంటే ఏయే ఆరోగ్య లాభాలు పొందొచ్చో కింద‌కు ఓ లుక్కేసేయండి.

గుండె ఆరోగ్యాన్ని పెంచ‌డంలో అనాస పువ్వు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.దీనిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల బ్లెడ్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది.

ఫ‌లితంగా గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.అలాగే నెల‌స‌రి నొప్పుల‌ను దూరం చేయ‌డంలో అనాస పువ్వు గ్రేట్‌గా హెల్ప్ చేస్తుంది.

అందువ‌ల్ల, నెల‌స‌రి స‌మ‌యంలో అనాస పువ్వుతో టీ త‌యారు చేసుకుని తాగితే ఎంతో మంచిది.

అనాస పువ్వు టీని తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స్ట్రోంగ్‌గా మారుతుంది.

జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు, క‌ఫం వంటి స‌మ‌స్యల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

"""/"/ డిప్రెష‌న్‌తో బాధ ప‌డే వారు రోజుకు ఒక క‌ప్పు అనాస పువ్వు టీని తీసుకోవాలి.

ఇలా చేస్తే అందులో ఉండే శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ డిప్రెష‌న్‌, ఒత్తిడి, అందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌న్నిటినీ నివారిస్తాయి.

అంతే కాదు, అనాస పువ్వును త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.

స్త్రీ, పురుషుల్లో లైంగిక స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.ర‌క్త‌పోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.

మ‌రియు నిద్ర లేమి నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్ జనజాతర సభ