బచ్చలి కూరతో ఆశ్చర్యపరిచే ఆరోగ్య లాభాలు.. డోంట్ మిస్?
TeluguStop.com

ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు ఖచ్చితంగా మన డైట్‌లో ఉండాలి.ఆరోగ్య నిపుణులు కూడా ఎప్పటికప్పుడే ఇదే చెబుతుంటారు.


ఎందుకంటే.మానవ శరీరానికి కావాల్సిన అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్లు, అనేక పోషకాలు ఆకుకూరల్లో లభిస్తాయి.


అయితే ఈ ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యకరమైన ఆకుకూరల్లో `బచ్చలి కూర` కూడా ఒకటి.
బచ్చలి కూరతో రకరకాల వంటలు చేస్తుంటారు.బచ్చలి కూర పప్పు, బచ్చలి కూర పచ్చడి, బచ్చలి కూర ఇగురు ఇలా రకరకాలుగా చేసుకుంటుంటారు.
అయితే ఎలా చేసినా.బచ్చలి కూర ఎంతో రూచిగా ఉంటుంది.
కానీ, కొందరు మాత్రం బచ్చలి కూర తినడానికే ఇష్టపడరు.కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే విషయాలు తెలుసుకుంటే.
బచ్చలి కూర ఖచ్చితంగా డైట్‌లో చేర్చుకుంటారు.మరి లేట్ చేయకుండా బచ్చలి కూర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా రక్తహీనత లేదా ఎనీమియా.చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
అయితే ఇలాంటి వారు ఐరన్ పుష్కలంగా ఉండే బచ్చలి కూరను తీసుకుంటే.సులువుగా రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అలాగే విటమిన్ ఏ తో పాటు బీటాకెరాటిన్ కూడా అధికంగా ఉండే బచ్చలి కూర తీసుకోవడం వల్ల కంటి సమస్యలు దూరమై.
చూపును మెరుగుపరుస్తాయి.ఇక శరీర రోగ నిరోధక శక్తి పెంచే విటమిన్ సి కూడా బచ్చలి కూరలో ఉంటుంది.
బచ్చలికూర తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది.అదే సమయంలో మూత్రవిసర్జనలో ఏవైనా సమస్యలు ఉంటే.
వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.తరచూ బచ్చలి కూర జ్యూస్ తీసుకుంటే.
అందులో ఉండే కాల్సియం, పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలు ఎముకులను దృఢంగా మారుస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అలాగే బచ్చలిలో ఉండే సాఫోనిన్ అనే పదార్థం క్యాన్సర్ వంటి భయంకర సమస్యలను రాకుండా రక్షిస్తుంది.