ఒక కప్పు సన్నజాజి ‘టీ’ తాగితే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?
TeluguStop.com
సన్నజాజి పూలు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.గుబాళించే వీటి పరిమళానికి మగువలే కాదు మగవారు సైతం ఫిదా అవుతుంటారు.
పల్లెటూర్లలో దాదాపు అందరి ఇళ్లల్లోనూ దర్శనమిచ్చే సన్నజాజి మొక్క పాజిటివ్ ఎనర్జీని అందించగలదు.
అలాగే ఈ మొక్క యొక్క పువ్వులు, ఆకులు, వేర్లు ఇలా అన్ని ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడతుంటాయి.
ముఖ్యంగా సన్నజాజి పూలు అలకరణకు మాత్రమే అని చాలా మంది భావిస్తుంటారు.కానీ, ఇవి బోలెడన్ని ఆరోగ్య లాభాలనూ అందించగలవు.
"""/"/
అవును, సన్నజాజి పూలతో తయారు చేసిన టీని సేవిస్తే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.
మరి లేటెందుకు సన్నజాజి టీ సేవించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో చూసేయండి.
ప్రతి రోజు ఒక కప్పు సన్నజాజి టీ తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
దాంతో గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
అలాగే సంతానలేమితో సతమతమవుతున్న దంపతులకు సన్నజాజి టీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.
రెగ్యులర్‌గా ఒక కప్పు ఈ టీను తాగితే మగవారిలో వీర్యకణాలు వృద్ధి జరుగుతుంది.
మరియు ఆడవారిలో గర్భాశయ వ్యాధిలు దూరమై సంతాన సాఫల్యత పెరుగుతుంది.బరువు తగ్గాలని ప్రయత్నించే వారు ఈ టీను తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు.
"""/"/
కండరాల నొప్పులతో ఇబ్బంది పడే వారు సన్నజాజి టీని తీసుకుంటే.నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
అంతేకాదు, రోజూ సన్నజాజి టీని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.
జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.నీరసం, అలసట, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి.
మరియు శరీరంలో అధిక వేడి సైతం తగ్గుతుంది.
రామ్ చరణ్ దర్గాకు వెళ్లడంపై తనికెళ్ల భరణి రియాక్షన్ ఇదే.. ఆయన ఏమన్నారంటే?