గోంగూర కాయల గురించి నమ్మలేని నిజాలు..తెలిస్తే మైండ్‌బ్లాకే!
TeluguStop.com
గోంగూరపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తినే ఆకుకూర.
అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాదు.బోలెడన్ని పోషకాలూ గోంగూరలో నిండి ఉంటాయి.
అయితే గోంగూరతో కంటే ఎక్కువ ప్రయోజనాలను గోంగూర కాయలతో పొందొచ్చన్న విషయం చాలా అంటే చాలా మందికి తెలియదు.
ఈ క్రమంలోనే వాటిని పడేస్తుంటారు.కానీ, ఇకపై మాత్రం అలా చేయకండి.
గోంగూర కాయలు ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి.ఎన్నో జబ్బులను నివారిస్తాయి.
గోంగూర మాదిరిగానే పుల్లగా ఉండే గోంగూర కాయలతో కొందరు రోటి పచ్చడి, నిల్వ పచ్చడి చేసుకుంటారు.
అలాగే కొందరు కూరల్లో వేసి వండుకుని తింటారు.ఇలా ఎలా తిన్నా మాస్తు హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.
ముఖ్యంగా గోంగూర కాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
తద్వారా గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది. """/"/
అలాగే మధుమేహం వ్యాధి గ్రస్తులకు గోంగూర కాయలు ఓ వరంగా చెప్పుకోవచ్చు.
అవును, ఒక గ్లాస్ వాటర్‌లో మూడు లేదా నాలుగు గోంగూర పువ్వులు వేసుకుని బాగా మరిగించి.
పరగడుపున తీసుకుంటే గనుక బ్లడ్ షుగర్ లెవల్స్ ఎప్పుడూ అదుపులో ఉంటాయి.అధిక బరువు సమస్య దూరం అవుతుంది.
రోగ నిరోధక వ్యవస్థ బల పడి.జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి.
అంతే కాదు, గోంగూర పువ్వులు వేసి మరిగించిన నీటిని సేవించటం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు నయం అవుతాయి.
కిడ్నీలు శుభ్ర పడతాయి.మెదడు పని తీరు మెరుగు పడుతుంది.
జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.కంటి చూపు పెరుగుతుంది.
మరియు చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది.
ఆ మూవీ షూటింగ్ సెట్లో జానీ మాస్టర్ కూతురు పుట్టినరోజు వేడుకలు.. ఏం జరిగిందంటే?