బీరకాయ తొక్కే కదా అనుకోకండి.. దాని వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
TeluguStop.com

బీరకాయ.( Ridge Gourd ) చాలా మందికి ఫేవరెట్ వెజిటేబుల్ ఇది.


బీరకాయతో ఇగురు, పులుసు, వేపుడు, పచ్చడి ఇలా ఎన్నో రకాల వంటలు తయారు చేస్తుంటారు.


అయితే బీరకాయను వండేటప్పుడు దాదాపు అందరూ చేసే పొరపాటు ఏంటంటే తొక్క చెక్కేసి డస్ట్ బిన్ లోకి తోసేయడం.
మీరు ఇదే చేస్తారు కదూ.? తొక్కే కదా అనుకోకండి.
అసలు దాని వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలు ( Health Benefits )న్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
"""/" /
బీరకాయ లోనే కాదు తొక్కలోనూ పోషకాలు మెండుగా ఉంటాయి.ఫైబర్, ఐరన్, కాల్షియం.
ఇలా బీరకాయ తొక్క ద్వారా బోలెడు పోషకాలు పొందవచ్చు.బీరకాయ తొక్కతో పచ్చడి చేసుకునే తినవచ్చు.
లేదా బీరకాయ తొక్కలను కలిగి ఎండ బెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండ పెట్టుకున్న బీరకాయ తొక్కలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
అలాగే రెండు ఎండుమిర్చి, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, మూడు రెబ్బలు కరివేపాకు వేయించి పొడి చేసుకోవాలి.
"""/" /
ఈ పొడిలో బీరకాయ తొక్కల పొడి మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పొడిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ పొడిని ప్రతి రోజూ వన్ టేబుల్ స్పూన్ చొప్పున రైస్ తో కలిపి తీసుకోవాలి.
ఈ విధంగా బీరకాయ తొక్కలను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం ( Constipation )దూరం అవుతుంది.
అలాగే ఈ బీరకాయ తొక్కల పొడిని నిత్యం తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది.
రోగ నిరోధక వ్యవస్థ( Immune System ) బలపడుతుంది.బ్రెయిన్ షార్ప్ అవుతుంది.
గుండె పనితీరు మెరుగుపడుతుంది.కొలెస్ట్రాల్ కరుగుతుంది.
వెయిట్ లాస్ అవుతారు.మరియు బ్లడ్ షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా సైతం ఉంటాయి.
కాబట్టి ఇకపై బీరకాయ తొక్కలను అస్సలు పారేయకండి.పచ్చడి లేదా పైన చెప్పిన విధంగా పొడి తయారు చేసుకునే తీసుకునేందుకు ప్రయత్నించండి.
అలర్ట్, రెస్టారెంట్ బిల్లులు కూడా ఫేక్ చేస్తోన్న AI.. కొత్త టెన్షన్ మొదలైంది!