అరటిపండే కాదు..అరటికాయ తిన్నా ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
TeluguStop.com
అరటి పండు రుచిగా ఉండటంతో పాటుగా.ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది.
ఎన్నో జబ్బులను నివారిస్తుంది.ఎందుకంటే, అరటి పండులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.
అందు వల్లనే, అందరూ అరటి పండును ఇష్టంగా తింటుంటారు.అయితే అరటి పండు మాత్రమే కాదు అరటి కాయ కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.