ప్ర‌తి రోజు రాగి సంగటి తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

రాయలసీమ, కర్ణాటక వంటకాల్లో అత్యంత ఫేమ‌స్ అయిన వంట‌కం రాగి సంగ‌టి లేదా రాగిముద్ద గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

ముఖ్యంగా రాగి సంగ‌టి విత్ నాటుకోడి పులుసు కాంబినేష‌న్ అదిరిపోతుంద‌ని చెప్పాలి.అయితే రాగుల‌తో చేసే రాగి సంగ‌టి రుచిలోనే కాదు.

ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర్చ‌డంలోనూ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ప్ర‌తి రోజు రాగి సంగ‌టి తిన‌డం వ‌ల్ల ఏ ఏ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి సంగ‌టి తిన‌డం వ‌ల్ల‌.అందులో పుష్క‌లంగా ఉండే క్యాల్షియం ఎముకల‌ను, కండ‌రాలు, దంతాల‌ను దృఢంగా.

గట్టిగా ఉండటానికి తోడ్పడుతుంది.అలాగే నేటి కాలంలో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

బ‌రువు త‌గ్గ‌డానికి నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.అయితే అలాంటి వారు వైట్ రైస్‌కు బ‌దులుగా ప్ర‌తి రోజు రాగి సంగ‌టి తీసుకుంటే.

శ‌రీరంలో అద‌న‌పు కొవ్వును క‌రిగించి అధిక బ‌రువుకు చెక్ పెడుతుంది.మ‌రియు రాగి సంగ‌టి తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది.

దీంతో వేరే ఆహార ప‌దార్థాలు కూడా తీసుకోలేరు.త‌ద్వారా బ‌రువు త‌గ్గొచ్చు.

రాగి సంగ‌టి ప్ర‌తి రోజు తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ క‌రిగించి.

మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది.త‌ద్వారా గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

అలాగే నేటి కాలంలో చాలా మంది చిన్న వ‌య‌సులో డయాబెటిస్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

అలాంటి వారికి రాగి సంగ‌టి ఓ ఔష‌ధంలా ప‌ని చేస్తుంది.వైట్ రైస్ బ‌దులు రాగి సంగ‌టి ప్ర‌తి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల‌.

శ‌రీరంలోని చెక్కర స్థాయిలు అదుపులోకి తీసుకువ‌స్తుంది.ఇక రాగి సంగ‌టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రో అద్భుత ప్ర‌యోజ‌నం ఏంటంటే.

ర‌క్త హీన‌త దూరం అవుతుంది.జీర్ణశ‌క్తి బ‌ల‌ప‌డుతుంది.

మ‌రియు చ‌ర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

పచ్చిమిర్చిని లిప్‌బామ్‌గా పెదవులకు రాసుకున్న యువతి.. నెక్స్ట్ టైం అయిందో చూస్తే..?