వెయిట్ లాస్‌, షుగ‌ర్ కంట్రోల్‌తో స‌హా క్వినోవా ద్వారా ఏయే లాభాలను పొందొచ్చో తెలుసా?

ధాన్యాల్లోనే ఎన్నో ర‌కాలు ఉన్నాయి.అందులో క్వినోవా ఒక‌టి.

దక్షిణ అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన ధాన్య‌మిది.అన్ని ధాన్యాల కంటే ఇది ఎంతో ఉత్త‌మ‌మైన‌ది మ‌రియు ఆరోగ్య‌క‌ర‌మైన‌ది.

అందుకే క్వినోవాను మదర్‌ ఆఫ్‌ ఆల్‌ గ్రెయిన్స్ అని అంటుంటారు.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో ఇప్ప‌టికీ క్వినోవా గురించి చాలా మందికి స‌రైన అవ‌గాహ‌న లేదు.

క్వినోవా అన్న ప‌దం విన‌ని వారు కూడా ఎంద‌రో ఉన్నారు.అలాంటి వారి కోస‌మే.

క్వినోవాను ఏ విధంగా తీసుకోవాలి.? అస‌లు క్వినోవాను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఏయే ఆరోగ్య లాభాల‌ను పొందొచ్చు.

? వంటి విష‌యాల‌ను ఇప్పుడు చ‌ర్చించుకోబోతున్నాము.క్వినోవాతో రోటీ, ఉప్మా, పోహా, సలాడ్, సూప్‌, పాన్ కేక్, స్మూతీ ఇలా వివిధ ర‌కాలుగా త‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు.

క్వినోవాను ఇలా ఎలా తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాల‌ని భావించే వారు వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్‌, బ్లాక్ రైస్‌, గోధుమ‌లు వంటి వాటిని ఎంచుకుంటారు.

కానీ, అన్నిటిక‌న్నా క్వినోవా బెస్ట్ ఆప్ష‌న్.దీనిని తీసుకుంటే ఆక‌‌లి నియంత్ర‌ణ‌లో ఉండ‌ట‌మే కాదు.

వేగంగా బ‌రువు త‌గ్గుతారు.అలాగే మ‌ధుమేహం వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారికి.

క్వినోవా ఉత్త‌మ‌మైన ఆహారం.క్వినోవాను డైట్‌లో చేర్చుకుంటే.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలో కంట్రోల్‌లో ఉంటాయి.నిద్ర‌లేమితో స‌త‌మ‌తం అయ్యేవారికి క్వినోవా ఎంతో మేలు చేస్తుంది.

దీనిని నైట్ డిన్న‌ర్‌లో తీసుకుంటే మెద‌డు, మ‌న‌సు ప్ర‌శాంత‌గా మార‌తాయి.త‌ద్వారా చ‌క్క‌టి నిద్ర ప‌డుతుంది.

"""/" / అంతేకాదండోయ్‌.క్వినోవాను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ప్రోటీన్ పుష్క‌లంగా ల‌భిస్తుంది.

ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా మార‌తాయి.గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య దూరం అవుతుంది.

మ‌రియు ర‌క్త‌హీన‌త బారిన ప‌డ‌కుండా కూడా ఉంటాయి.

వైరల్: ఇదెలా సాధ్యం.. నల్ల కుక్క రెండేళ్లలో తెల్లగా ఎలా మారిపోయిందబ్బా..?!