Cabbage : పర్పుల్ క్యాబేజీ తో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే తినకుండా ఉండలేరు!
TeluguStop.com
క్యాబేజీ( Cabbage ).చాలా మంది ఇష్టంగా తినే ఆకుకూరల్లో ఒకటి.
పైగా సీజన్ తో పని లేకుండా ఏడాది పొడవునా క్యాబేజీ లభ్యమవుతుంటుంది.అయితే మనందరికీ గ్రీన్ కలర్ క్యాబేజీ మాత్రమే పరిచయం.
కానీ క్యాబేజీ పర్పుల్( Purple Cabbage ) కలర్ లో కూడా ఉంటుంది.
గ్రీన్ క్యాబేజీ( Green Cabbage ) కంటే పర్పుల్ క్యాబేజీలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
పర్పుల్ క్యాబేజీతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే తినకుండా ఉండలేరు.పర్పుల్ క్యాబేజీలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచుతుంది.ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది.
దీంతో మలబద్ధకం సమస్య తలెత్తకుండా ఉంటుంది.అలాగే గ్రీన్ క్యాబేజీతో పోలిస్తే పర్పుల్ క్యాబేజీలో విటమిన్ సి( Vitamin C ) అధిక మొత్తంలో ఉంటుంది.
అందువల్ల పర్పుల్ క్యాబేజీని డైట్ లో చేర్చుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం లభిస్తుంది.వెయిట్ లాస్( Weight Loss ) అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి పర్పుల్ క్యాబేజీ ఎంతో మేలు చేస్తుంది.
పర్పుల్ క్యాబేజీలో కేలరీలు తక్కువగా ఉంటాయి.ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
పర్పుల్ క్యాబేజీ వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.అతి ఆకలిని దూరం చేస్తుంది.
"""/" /
ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా కంటి చూపు తగ్గడం అనేది ఎంతో మందిలో తలెత్తుతున్న సమస్య.అయితే పర్పుల్ క్యాబేజీ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
పర్పుల్ క్యాబేజీలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును( Eyesight ) షార్ప్ గా మారుస్తుంది.
కంటి లోపల మచ్చలను తగ్గించటంలో హెల్ప్ చేస్తుంది.కంటి శుక్లాలు రాకుండా కాపాడుతుంది.
"""/" /
అంతేకాకుండా క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి.ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షిస్తాయి.
క్యాన్సర్ వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.పర్పుల్ క్యాబేజీని డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత జబ్బులకు సైతం దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి ఇకపై పర్పుల్ క్యాబేజీ కనిపిస్తే అస్సలు వదిలిపెట్టకండి.
పెళ్లి పీటలపైనే ప్రాణాలు కోల్పోయిన వరుడు.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!