సీజ‌న‌ల్‌ ఫ్రూట్ `పంపర పనస` గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

పంపర ప‌న‌స‌.ప్ర‌స్తుతం ఈ వింట‌ర్ సీజ‌న్‌లో విరి విరిగా ల‌భించే పండ్ల‌లో ఇదీ ఒక‌టి.

నిమ్మ జాతికి చెందిన పంప‌ర ప‌న‌స రుచిగా ఉండ‌ట‌మే కాదు.బోలెడ‌న్ని పోష‌కాల‌ను సైతం క‌లిగి ఉంటుంది.

అయితే చాలా మంది పంప‌ర ప‌న‌స‌ను తినేందుకు నిరాక‌రిస్తుంటారు.కానీ, పంప‌ర ప‌స‌న పండు అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి తెలిస్తే మాత్రం తిన‌కుండా ఉండ‌లేరు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం పంప‌ర ప‌న‌సను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి.

"""/"/ అధిక బ‌రువు ఉన్న వారికి పంప‌ర ప‌న‌స ఓ అద్భుత‌మైన పండుగా చెప్పుకోవ‌చ్చు.

ఎందుకంటే, దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు అదుపులోకి వ‌స్తుంది.శ‌రీరంలోని వ్య‌ర్థాల‌న్నీ బ‌య‌ట‌కు వెళ్లి పోయి మూత్ర పిండాలు, కాలేయం శుభ్ర ప‌డ‌తాయి.

అలాగే పంప‌ర ప‌న‌స‌ను ఆహారంలో భాగంగా చేర్చుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.

త‌ద్వారా సీజ‌న‌ల్ వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఎముక‌ల‌ను దృఢ‌ప‌రిచే సామ‌ర్థ్యం కూడా పంప‌ర ప‌న‌స‌కు ఉంది.

అందుకే ఎముక‌ల బ‌ల‌హీన‌త‌తో ఇబ్బంది ప‌డే వారు.ఈ సీజ‌న్‌లో విరి విరిగా దొరికే పంప‌ర ప‌న‌స‌ను త‌ర‌చూ తీసుకుంటూ ఉండాలి.

ఈ పండును తీసుకోవ‌డం వ‌ల్ల అందులోని పోష‌క విలువ‌లు చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

అదే స‌మ‌యంలో వృద్ధాప్య ఛాయ‌లు ద‌రి చేర‌కుండా అడ్డు క‌ట్ట వేస్తాయి. """/"/ అంతే కాదు, పంప‌ర ప‌న‌స‌ను తిన‌డం వ‌ల్ల రక్త ప్రసరణ అభివృద్ధి చెందుతుంది.

గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.మ‌రియు మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య సైతం దూరం అవుతుంది.

సో.ఇన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందించే పంప‌ర ప‌న‌స‌ను త‌ప్ప‌ని స‌రిగా తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.

రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమా లో నటించే స్టార్ నటులు వీళ్లే…